తమిళ 'వేదం' షూటింగ్ లో హీరోకు యాక్సిడెంట్...
తెలుగులో విజయవంతమైన వేదం చిత్రం క్రిష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో అల్లు అర్జున్ చేసిన కేబుల్ రాజు పాత్రను తమిళంలో శింబు పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని కీలక సన్నివేశం చిత్రీకరణ కోసం దర్శకుడు వేగంగా బైక్ నడపమన్నప్పుడు..ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ట్రిపుల్ కేన్ ఏరియాలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పటిల్ కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసారు. అతని తలకు చిన్న దెబ్బ తగిలి..మోచేతులు కొట్టుకుపోయాయి. వారం రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ ఎడ్వైజ్ చేసారు. అనంతరం శింబు మాట్లాడుతూ...నేను పునర్జన్మ ఎత్తిన ఫీలింగ్ కలిగింది. నేను కొద్ది క్షణాలు పాటు లిటరల్ గా షేక్ అయిపోయాను. అయితే నా మైండ్ ఎలర్ట్ గా ఉండటంతో వెంటనే తేరుకోగలిగాను. లేకపోతే ఈ బిజీ రోడ్డులో నా ప్రక్క నుంచి దూసుకు పోయిన కారుకి బలై పోయి ఉండేవాడిని..కొద్దిలో తప్పించుకోగలిగాను అన్నారు. ఇక ఈ చిత్రం ఓ పాట మినహా షూటింగ్ పూర్తై పోయినట్లే అన్నారు. ఈ చిత్రంలో భరత్, అనూష్క, స్నేహా ఉల్లాల్, సోనీ అగర్వాల్, ప్రకాష్ రాజ్ మిగతా పాత్రల్లో కనిపించనున్నారు. ఇంతకు ముందు కూడా భరత్ కి ఈ షూటింగ్ లో యాక్సిడెంట్ జరిగింది.


Click it and Unblock the Notifications











