కారు ఏక్సిడెంటు కేసులో హీరో...

By Staff

Simbhu
తమిళ పరిశ్రమలో హఠాత్తుగా శింబు,అతని Ford Mondeo కారు రెండూ పాపులర్ అయ్యాయి. కారణం రెండు రోజుల క్రిందట ఆ కారు ఓ టు వీలర్ ని ఏక్సిడెంట్ చేయటమే. చెంగల్పట్టు దగ్గరలో సెల్వక్కమ్ వద్ద రాత్రి 1.30 కు జరిగిన ఈ ప్రమాదంలో దేవరాజు(39) అనే వ్యక్తి మరణించగా,బాబు,అంబలగన్ అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం శింబు డైవర్ వసంత్ కుమార్ కారు దొంగతనం చేసి ఎత్తుకుపోవటం వల్ల జరిగింది అని పోలీసు స్టేషన్ లో శింబు తండ్రి టి.రాజేంద్రన్ కంప్లైయింట్ చేసాడు.

ఇక అక్కడ మీడియా సమాచరం ప్రకారం.. శింబు ఓ నైట్ క్లబ్ లో పార్టీ లో ఉండగా అక్కడ బయిట డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో శింబు తల్లి ఉషారాజేంద్రన్ అతనికి ఫోన్ చేసి అర్జెంటుగా వెనక్కి కారు తీసుకురమ్మని పురమాయించిదిట. శింబు కూడా తల్లి చెప్పిందే చేయమన్నాడుట. దాంతో కంగారుగా వెళ్తున్న డ్రైవర్ ఈ యాక్సిడెంట్ చేసాడుట. అయితే ఈ విషయమై ఉషా రాజేంద్రన్ ఏమీ స్పందించటం లేదు. శింబు తన కారు పోయిందని తన స్నేహితుడు కారులో ఆ పార్టీకి హాజరయ్యానని చెపుతున్నాడు. సినిమా కథలా మారిన ఈ యాక్సిడెంట్ ఇష్యూలో నిజం ఏమిటన్నది తేలటం కష్టమే అని కొందరు సినీ ప్రముఖులు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X