అల్లు అర్జున్ క్లోజ్ ప్రెండ్ ఆ తమిళ స్టార్ హీరో
అల్లు అర్జున్‌కు మంచి స్నేహితుడు శింబు. అల్లు అర్జున్ నటించిన ఏ చిత్రం విడుదలయినా తొలి రోజే చూస్తారు. వేదం చిత్రాన్ని చూడగానే నచ్చిందట అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు క్రిష్. ఆయన ప్రస్తుతం తమిళంలో వేదం రీమేక్ వానమ్ ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. ఇక వేదం ఎలా వర్కవుట్ అయిందో చెబుతూ... నిజం చెప్పాలంటే వేదం రీమేక్ కి ముఖ్య కారకుడు శింబు. ఆయన ఈ చిత్రం చూసిన వెంటనే తమిళంలో చేయాలని నిర్ణయానికి వచ్చేసి తన మిత్రుడు ఏటీవీ గణేష్‌కు తన అభిప్రాయాన్ని చెప్పారట. దీంతో ఆ చిత్రాన్ని నేను నిర్మిస్తానని గణేష్ ముందుకు రావడంలో ఇద్దరూ నాతో మాట్లాడారు. నన్నే దర్శకత్వం చేయమనండంతో ఒప్పుకున్నాను. అనుష్క, భరత్, స్నేహ ఉల్లాల్, వేగ, సోనియా అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు. అలాగే ఇతర దర్శకులు రీమేక్ చేస్తే ఒరిజనల్ కథను అలాగే చిత్రీకరిస్తారు. అదే ఒరిజినల్ చిత్ర దర్శకుడు చేస్తే అందులోని తప్పొప్పులను సరిదిద్దుకొనే అవకాశం ఉంటుంది. నేను అదే చేశాను అన్నారు.


Click it and Unblock the Notifications











