twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ అవుతున్న శింబు వీడియో : అలా చేస్తే తుఫాన్ బాధితులకు మరింత సహాయం!

    |

    గజ తుఫాన్ కారణంగా తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో తీవ్ర నష్టం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు తమిళ సినీ నటులు తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు తమవంతు సహాయం అందిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో నటుడు శింబు మరింత మంది ప్రజలు విరాళాలు అందించేలా ప్రోత్సహిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. డోనర్, బెనిఫిషరీస్ మధ్య డబ్బు‌లు పంపే విధానం పారదర్శకంగా ఉండేలా ఒక కొత్త ఐడియా తెరపైకి తెచ్చారు.

    Simbu about Cyclone Gaja Relief

    మనలో చాలా మందికి తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన వారికి ఏదైనా సహాయం చేయాలని ఉంటుంది. కొందరు డొనేట్ చేస్తున్నారు కూడా. ఇంకా చాలా మంది డొనేట్ చేయాల్సి ఉంది. మరికొందరికి తాము చేయాలనుకున్న చిన్న సహాయం ఎలా చేయాలో తెలియదు.

    మనం అందరం సెల్ ఫోన్లు వాడుతున్నాం. సెల్ ఫోన్ నెట్వర్క్ ఉపయోగించి మనం డొనేట్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎవరు ఎంత డొనేట్ చేశారు అనే దానికి ఒక లెక్క ఉంటుంది. మన డబ్బు బాధితులకు చేరిందా? లేదా? తెలుసుకునే వీలుంటుంది.

    గవర్నమెంట్ సెల్ ఫోన్ నెట్వర్క్ ద్వారా చిన్న మొత్తం కూడా డొనేట్ చేసే వీలు కల్పిస్తే.... చాలా మంది సహాయం ముందుకు వస్తారు. పది రూపాయలు, వంద రూపాయలు డొనేట్ చేయాలనుకునే వారికి కూడా అవకాశం కల్పించినట్లు అవుతుంది అని శింబు అన్నారు.

    English summary
    Actor Simbu who was known fro raising his voice for social issues has came up with a new idea to make the transactions transparent between the donors and the beneficiaries.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X