నయనతారకు పెళ్లయినప్పుడు చూద్దాం అంటున్న యంగ్ సూపర్ స్టార్
'ఆమెను మరచిపోదామనుకున్నా మీడియానే మళ్ళీ మళ్లీ గుర్తుకు తెస్తోంది. ఆమెకు పెళ్లయినప్పుడు చూద్దాం' అంటూ యంగ్ సూపర్ స్టార్ , నయనతార మాజీ ప్రియుడు శింబు వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా నటిస్తున్న 'వస్తి' చిత్రం పూజా కార్యక్రమం సోమవారం ఏవీఎం స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించాడు. నయనతారకు వచ్చే నెలలో వివాహమని వార్తలొస్తున్నాయి కదా అని శింబును ప్రశ్నించగా పైవిధంగా అన్నారు.
అలాగే తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నానని, ప్రేమపెళ్లికి కూడా అవకాశం లేకపోలేదని అన్నారు. నయనతార, శింబు మధ్య ప్రేమాయణం సాగుతున్నప్పుడు బయటపడిన వారి ముద్దు పెట్టుకున్న దృశ్యాల ఫోటోలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక నయనతార, ప్రభుదేవాల వివాహంపై అధికారికంగా వార్తలు లేకపోయినా వచ్చే నెలలో జరగటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార ...బాలకృష్ణ సరసన బాపూ దర్శకత్వంలో శ్రీరామ రాజ్యం చిత్రంలో సీ
తగా చేస్తోంది.


Click it and Unblock the Notifications











