Bigg Boss హోస్ట్‌గా యంగ్ స్టార్ హీరో.. ఆ ఇద్దరు టాప్ హీరోయిన్లను పక్కకు నెట్టి..

తమిళ బిగ్‌బాస్ ఓటీటీ షో అల్టిమేట్‌ నుంచి హోస్ట్‌గా కమల్ హాసన్ తప్పుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పటి వరకు తమిళ బిగ్‌బాస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కమల్ అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత తన నిర్ణయంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో ఆందోళన తగ్గింది. అయితే కమల్ తప్పుకోవడంతో హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారు అనే ప్రశ్న ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో వెంటాడుతున్నది. ఈ క్రమంలో హోస్ట్‌గా ఓ స్టార్ హీరో పేరు ఖారారైంది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ నుంచి తప్పుకొన్న కమల్

బిగ్‌బాస్ నుంచి తప్పుకొన్న కమల్

తమిళంలో బిగ్‌బాస్ షోకు మంచి స్పందనతోపాటు రేటింగ్ లభించింది. ఇటీవల ఓటీటీలో 24 గంటలపాటు స్ట్రీమింగ్ అయ్యే ఓటీటీ ఫార్మాట్ బిగ్‌బాస్ అల్టిమేట్‌కు కూడా కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే కొద్దివారాల అనంతరం తాను బిగ్‌బాస్ అల్టీమేట్ నుంచి తప్పుకొంటున్నాను. అందుకు కారణం తాను నిర్మిస్తున్న విక్రమ్ సినిమానే కారణం. కోవిడ్ కారణంగా విక్రమ్ షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఆ సినిమాను వేగంగా ఫినిష్ చేయాలని అనుకొంటున్నాం. తమిళంలో స్టార్ ఆర్టిస్టుల డేట్స్ క్లాష్ అవుతున్నాయి. కాబట్టి అల్టిమేట్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే తప్పుకొన్నాను అని కమల్ ఓ ప్రకటనలో తెలిపారు.

బిగ్‌బాస్ తమిళ్ 6కి అందుబాటులో ఉంటా

బిగ్‌బాస్ తమిళ్ 6కి అందుబాటులో ఉంటా

అయితే బిగ్‌బాస్ తన హృదయానికి చాలా దగ్గరైంది. డీస్నీ+హాట్ స్టార్, విజయ్ టీవీ యాజమాన్యం తనకు బాగా సహకరించింది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ షోకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అభిమానులు నా నిర్ణయాన్ని గౌరవిస్తారని అనుకొంటున్నాను. అయితే అల్టిమేట్ పక్కన పెడితే.. బిగ్‌బాస్ తమిళ 6కు అందుబాటులో ఉంటాను అని కమల్ హాసన్ తన సుదీర్ఘమైన లేఖలో వివరించారు.

రమ్యకృష్ణ, సమంత రేసులోకి

రమ్యకృష్ణ, సమంత రేసులోకి


అయితే కమల్ హసన్ హోస్ట్‌గా తప్పుకొన్న తర్వాత దక్షిణాది టాప్ హీరోయిన్లు రమ్యకృష్ణ, సమంత పేర్లు మీడియాలో హల్‌చల్ చేశాయి. అందుకు కారణం తెలుగు బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున అందుబాటులో లేకపోవడంతో రమ్యకృష్ణ ఓసారి, సమంత మరోసారి హోస్ట్‌గా వ్యవహరించి ఆకట్టుకొన్నారు. దాంతో కమల్ ప్లేస్‌ను భర్తీ చేయడం వారికి సాధ్యమవుతుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమైంది. అయితే హోస్ట్‌గా యువ హీరో శింబును తెరపైకి తీసుకురావడంతో అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు.

హోస్ట్‌గా యువ హీరో శింబు

హోస్ట్‌గా యువ హీరో శింబు

అయితే కమల్ హాసన్ తర్వాత అంత క్రేజ్ ఉన్న హీరో శింబు కాకపోయినప్పటికి.. ఈ యువ హీరోకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. వ్యక్తిగతంగా రొమాంటిక్ స్టేచర్ ఉండటం, ఎప్పుడూ వివాదాలు, సంచలన వార్తలకు అడ్రస్‌గా మారడంతో శింబు ఈ బిగ్బాస్ ఫార్మాట్‌కు సరిపోతాడని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ క్రమంలో శింబును సంప్రదించగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించడంతో హోస్ట్‌గా ఆయన పేరు ఖరారైంది. ఈ విషయాన్ని డిస్నీ+హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం శింబుకు ఇదే మొదటిసారి కావడం గమనార్హం. బిగ్‌బాస్ అల్టిమేట్ షోకు వచ్చేవారం నుంచి శింబు హోస్ట్‌గా వ్యవహరిస్తారు.

Recommended Video

Simbu Asked TV Organisers To Delete some Portions Of Interview About Nayanatara & Hansika
శింబు సినిమా కెరీర్ ఇలా..

శింబు సినిమా కెరీర్ ఇలా..


శింబు అలియాస్ సిలంబరాసన్ కెరీర్ విషయానికి వస్తే.. వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న ఆయన 2021లో ఈశ్వరన్, మనాడు చిత్రాల హిట్స్‌తో మళ్లీ స్టార్ హీరోగా నిలదొక్కుకొన్నాడు. ప్రస్తుతం మహా చిత్రంలో స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. అలాగే వెండు థానిందాథు కాదు. పాథు థలా, కరోనా కుమార్ చిత్రాల్లో నటిస్తున్నారు. మహా చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా కాగా. మిగితా చిత్రాలు ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X