ఏమీ పీకలేరు, ఆవేశపడకండి.. ఫ్యాన్స్‌కు శింబు మెసేజ్.. చిక్కుల్లో అత్తారింటికి దారేది!

Recommended Video

Simbu Also Requested His Fans Not Target Particular Person

తమిళ స్టార్ హీరో శింబు స్టైల్, యాటిట్యూడ్ కు పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. శింబుకు ఎన్ని వివాదాలు ఉన్నా తన పని తాను చేసుకుంటూ పోతాడు. కెరీర్ ఆరంభంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో యువతలో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఇటీవల శింబు మణిరత్నం దర్శత్వంలో నటించిన నవాబ్ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం శింబు అత్తారింటికి దారేది రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర విడుదల విషయంలో చిక్కులు ఏర్పడ్డట్లు తెలుస్తోంది.

అత్తారింటికి దారేది రీమేక్

అత్తారింటికి దారేది రీమేక్

హీరో శింబు ప్రస్తుతం తెలుగు సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది రీమేక్ లో నటిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం రికార్డులు తిరగరాసింది. తమిళంలో ఈ చిత్రాన్ని దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనిఉన్నాయి.

వెంటాడుతున్న వివాదాలు

వెంటాడుతున్న వివాదాలు

హీరో శింబుకు వివాదాలు కొత్త కాదు. శింబు వివాదం వలన అత్తారింటికి దారేది చిత్ర రీమేక్ చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం అన్భ‌న‌వ‌న్ అస‌ర‌ద‌వ‌న్ అద‌న్గద‌వ‌న్(అఅఅ) అనే చిత్రాన్ని చేయడానికి శింబు కొందరు నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఆ చిత్రం ఆగిపోయింది. దీనితో నిర్మాతలు శింబుపై చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 విడుదల కానివ్వం

విడుదల కానివ్వం

తమ విషయం తేల్చే వరకు శింబు నటిస్తున్న అత్తారింటికి దారేది రీమేక్ వంత రాజ‌వ‌తాన్ వ‌రువెన్ చిత్రాన్ని విడుదల కానివ్వమని అఅఅ చిత్ర నిర్మాతలు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన వంత రాజ‌వ‌తాన్ వ‌రువెన్ చిత్రం వస్తుందా రాదా అని శింబు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది.

ఆవేశపడొద్దు

ఆవేశపడొద్దు

ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ని శాంతపరచడానికి శింబు ప్రయత్నించాడు. ఏక పక్షంగా తీసుకునే నిర్ణయం వలన ఒక చిత్రాన్ని ఎవరూ అడ్డుకోలేరు. చట్టపరమైన సమస్యలు ఉంటె నేను చూసుకుంటాను. అభిమానులు ఆవేశపడకుండా శాంతంగా ఉండాలని శింబు సూచించాడు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలామందితో చర్చించాల్సి ఉంటుంది. ఊరకనే అయిపోదు. వంత రాజ‌వ‌తాన్ వ‌రువెన్ చిత్రం సంక్రాంతికి తప్పకుండా వస్తుంది అని శింబు అభిమానులకు భరోసా ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X