twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగంలోకి రాధిక.. మరో సంచలన బయోపిక్, కాల్పుల వ్యవహారం చూపిస్తారా?

    |

    ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ పరిశ్రమ తీసుకున్న ప్రముఖుల జీవితాలపై సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో మరో సంచలన బయోపిక్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    ఒకప్పుడు తమిళనాట ప్రముఖ నటుగా వెలుగొందిన ఎంఆర్ రాధ జీవితం ఆధారంగా సినిమా రాబోతోంది. ఎంజీఆర్, శివాజీ గణేశన్ హయాంలో ఎంఆర్ రాధ విలన్ పాత్రలతో పాపులర్ అయ్యారు. ఎంఆర్ రాధ మరెవరో కాదు... సౌత్ ఇండియాలో ప్రముఖ యాక్టర్లుగా వెలుగొందుతున్న రాధిక శరత్ కుమార్, రాధా రవి, నిరోషా తండ్రి.

    శింబు, అరవింద స్వామి ముఖ్య పాత్రల్లో

    శింబు, అరవింద స్వామి ముఖ్య పాత్రల్లో

    ఎంఆర్ రాధ బయోపిక్‌లో తమిళ స్టార్స్ శింబు, అరవింద స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎంఆర్ రాధ పాత్రలో శింబు, ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటించే అవాకశం ఉందని టాక్. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

    రాధిక శరత్ కుమార్ సొంత బేనర్లో

    రాధిక శరత్ కుమార్ సొంత బేనర్లో

    తన తండ్రి బయోపిక్ రాధిక శరత్ కుమార్ తన సొంత బేనర్ రాడాన్ మీడియా వర్క్స్ సంస్థపై నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎంఆర్ రాధ మనవడు ఐకీ రాధ ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. తాతయ్య బయోపిక్ తీయబోతున్నట్లు ఐకీ గురువారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఐకీ ఇంతకు ముందు తమిళంలో ‘సంగిలి బుంగిలి' అనే చిత్రం చేశారు.

    ఎంఆర్ రాధపై బ్యాడ్ ఇమేజ్ వాస్తవం కాదు

    ఎంఆర్ రాధపై బ్యాడ్ ఇమేజ్ వాస్తవం కాదు


    దర్శకుడు ఐకీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...‘తాతయ్య ఎంఆర్ రాధలోని డిఫరెంట్ కోణం చూపించబోతున్నాను. కొన్ని వివాదాల కారణంగా ఆయనపై నెగెటివ్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఆయన్ను అంతా చెడ్డవాడు అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఆయనలోని అసలు కోణం చూపేందుకే ఈ బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

    కాల్పుల వ్యవహారం చూపిస్తారా?

    కాల్పుల వ్యవహారం చూపిస్తారా?

    ఎంఆర్ రాధ అప్పట్లో తమిళ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా వెలుగొందుతున్న ఎంజీఆర్‌పై కాల్పులు జరపడం సంచలనం అయింది. మరి ఈ బయోపిక్‌లో ఈ సంఘటన చూపిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సంఘటన తర్వాతే ఎంఆర్ రాధ మీద నెగెటివిటీ పెరిగిపోయింది. ఐకీ తన చిత్రంలో ఈ సంఘటన వెనక కారణాలు చూపించే అవకాశం ఉంది.

    ఎంఆర్ రాధ

    ఎంఆర్ రాధ

    1907లో జన్మించిన ఎంఆర్ రాధ 1930 నుంచి 1970 మధ్య తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా వెలుగొందారు. ఆయనకు మొత్తం ఐదుగురు భార్యలు. 9 మంది సంతానం. వీరిలో ఎంఆర్ఆర్ వాసు, రాధా రవి, రాధిక, నిరోష సినీరంగంలో స్థిరపడ్డారు.

    English summary
    Kollywood buzz is that Simbu and Arvind Swamy will be reprising the roles of MR Radha and MGR in MR Radha's biopic. It is revealed that the biopic is produced by MR Radha's daughter and actress Radikaa Sarathkumar under her home banner Radaan Media Works.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X