అనూష్క, నాగచైతన్య ల పెళ్ళి రూమర్ వెనక ఆ హీరో హస్తం
అనూష్క,నాగచైతన్యలకు ఎంగేజ్మెంట్ జరిగిందంటూ నాలుగు రోజుల క్రితం మీడియాలో సంచలనం రేగిన సంగతితెలిసిందే.దీనికి మూలం ఓ పాపులర్ తమిళ మ్యాగజైన్ లో వచ్చిన కథనం. అయితే ఆ కథనం రావటానికి వెనుక తమిళ హీరో శింబు ఉన్నాడని ఇప్పుడు అంతా వినపడుతోంది. శింబు మొదటినుంచి అమ్మాయిలంటే పడి ఛస్తాడని,అలాగే నయనతారతో ఎపైర్,ఆ మధ్య భావన తో ఛీ కొట్టించుకోవటం వంటివి జరిగాయి. అదే క్రమంలో అతని కన్ను అనూష్క పై పడింది.
అందుకే తన పాత్ర చిన్నదైనా అనూష్క ఉంటుందనే వేదం రీమేక్ వానమ్ కి ఒప్పుకున్నాడు.అయితే దర్శకుడుక్రిష్ తెలుగులో లాగానే ఆ కాంబినేషన్ సీన్స్ ని లేకుండా చేసేసాడు. దాంతో ఒళ్ళు మండిన శింబు తను ఏం చెప్తే అది రాసే పత్రికకు నాగచైతన్య,అనూష్కల నిశ్చితార్దం అని ఉప్పు అందించాడని,వారి దాన్ని బ్యానర్ ఐటమ్ గా రాసి సెన్సేషన్ చేసారు. అలా తనను పట్టించుకోకుండా,నాగార్జునకు దగ్గరయ్యే అనూష్క కెరీర్ కి తమిళంలో ఫుల్ స్టాప్ పెట్టేలనే ఆలోచనతోనే ఈ రూమర్ కి శింబు తెరతీసాడనితమిళ పరిశ్రమలో వినపడుతోంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











