స్టార్ హీరో పాడిన బూతు పాట....వివాదం
చెన్నై: తమిళ హీరో శింబు, అనిరుధ్ లపై మహిళా హక్కుల సంఘం 'ఆల్ ఇండియా డెమొక్రటిక్ వుమన్స్ అసోసియేషన్' కోయంబత్తూర్ లో ఫిర్యాదు చేసింది. ఆ పాట పేరు బీప్ సాంగ్. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన 'ఎన్న పీ.... లవ్ పన్ రోమ్' పాటలో అసభ్యకర పదాలు ఉండడంతో బీప్ సాంగ్ గా పేర్కొంటున్నారు.
ఈ పదాలు స్పష్టంగా విన్పిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బీప్ పాటను తాను విడుదల చేయలేదని తమిళ హీరో శింబు తెలిపాడు. ఈ పాట బయటకు రావడంపై గీత రచయిత చారు నివేదిత విస్మయం వ్యక్తం చేశాడు.

భారీ వర్షాలతో చెన్నై, తమిళనాడులోని కొన్ని జిల్లాలు అతలాకుతలమైన తరుణంలో బీప్ సాంగ్ ను విడుదల చేయడాన్ని శింబుఖండించాడు. అయితే తాను రాసిన ఈ పాటలో ప్రయోగించిన పదాలపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నాడు.
ఈ పాటను తాను విడుదల చేయలేదని శింబు వివరణయిచ్చాడు. అకారణంగా తనను నిందించడం పద్దతి కాదని అన్నాడు. ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఈ పాట అసభ్యకరంగా ఉందని అంతా మండిపడుతున్నారు.
ఈ వివాదంపై మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం అతడు టొరంటోలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











