'గబ్బర్ సింగ్' హిట్ చూసి ఏడుస్తున్న హీరో?
గబ్బర్ సింగ్ హిట్ చాలా మందిలో ఆనందాన్ని కలిగిస్తే ఆ హీరోకు మాత్రం చాలా బాధను కలిగిస్తోందిని వినికిడి. ఆ హీరో మరెవరో కాదు తమిళ హీరో శింబు. గబ్బర్ సింగ్ కన్నా ముందే తమిళంలో దబాంగ్ ని రీమేక్ చేసి ..ఓస్తి అనే చిత్రం చేసాడు. అయితే పెద్దగా మార్పులు చేయకుండా దబాంగ్ ని ఉన్నదున్నట్లుగా ఓస్తిగా తెరకెక్కించాడు. దాంతో అక్కడ నేటివిటి సమస్య వచ్చి డిజాస్టర్ అయ్యింది. అలాగే మల్లికా షెరావత్ తో చేసిన ఐటం సాంగ్ కూడా వర్కవుట్ కాలేదు.
ఈ నేపధ్యంలో శింబు ..ఇక్కడ తెలుగులో గబ్బర్ సింగ్ క్రియేట్ చేస్తున్న రికార్డు వసూళ్లు,సునామీ తరహాలో వచ్చి పడుతున్న కలెక్షన్స్ ని చూసి చాలా బాధపడుతున్నాడని చెన్నై పరిశ్రమలో వారు అంటున్నారు. తెలుగు చిత్రం రీమేక్ లు ఉన్నదున్నట్లు గా చేసే శింబు..కొద్ది రోజులు ఆగి గబ్బర్ సింగ్ ని రీమేక్ చేసినా హిట్ అయ్యేది కదా..అంటున్నాడట. అంతేగాక ఇప్పడంతా శింబు..ఓస్తిని,గబ్బర్ సింగ్ తో పోల్చటం కూడా బాధకలిగిస్తోందిట. ఆ రకంగా గబ్బర్ సింగ్ ..శింబుకి తీరని బాధను కలిచిందని చెప్తున్నారు.
దానికి తోడు తమిళంలోనూ డైరక్ట్ గా గబ్బర్ సింగ్ విడుదలై సంచలనంరేపుతున్న విషయం తెలిసిందే. 'నాక్కొంచెం తిక్కుంది.. అయితే దానికీ ఓ లెక్కుంది' అంటూ చెప్పిన డైలాగ్ ని తమిళ తంబీలకు తెగ నచ్చేసిందట. ఈ డైలాగ్ ని అక్కడ వాళ్ళు ''ఎనక్కు కొంజెం పైత్యం ఇరుక్కు .. అదక్కు ఒరు కానా ఇరుక్కు'' అని తమిళంలోకి మార్చుకుని చెప్పుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తమిళనాడులోని చెన్నై, మధురై, కోయంబత్తూర్ ఇలా ప్రధాన నగరాలు అన్నింటిలోనూ ఈ డైలాగే వినిపిస్తుంది. దాంతో శింబుకి పుండు మీద కారం జల్లిన చందంగా గబ్బర్ సింగ్ మారింది.
ఇదిలా ఉంటే దబాంగ్ హీరో సల్మాన్ కూడా గబ్బర్ సింగ్ చిత్రం గురించి ప్రశంసలు వర్షం కురిపించాడు. ఈ విషయమై సల్మాన్ మాట్లాడుతూ... సౌత్ లో హీరోలను దేముడులా ఆరాధిస్తారని తెలుసు. కానీ నేను ఓ హీరోకి ఇంత ఫాలోయింగ్, ఇంత క్రేజ్ ఊహించలేదు. ఈ మానియా చూస్తూంటే, నాకూ తెలుగులో ఓ చిత్రం చేయాలనిపిస్తోంది అన్నారు. గబ్బర్ సింగ్ ఓవర్ సీస్ లో కూడా దబాంగ్ కన్నా ఎక్కువ బిజినెస్ చేస్తోందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు తరుణ్ ఆదర్స్ లాంటివాళ్లు చెప్తున్నారు. ఇక సల్మాన్ ఈ చిత్రంలోని కెవ్వు కేక పాటకు చాలా ఇంప్రెస్ అయ్యాడని, తన దబాంగ్ 2లో ఆ పాటను పెట్టే అవకాశముందని బాలీవుడ్ టాక్. ఇవన్నీ శింబుకి బాధ కలిగించే విషయాలే కదా.


Click it and Unblock the Notifications











