పవన్ కళ్యాణ్ పోటీగా సూపర్ హీరో...!
బాలీవుడ్ లో 2010 లో విడుదలై సంచలన రీతిలో కలెక్షన్స్ కురిపించిన 'దబాంగ్' చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ కై చాలా రోజులుగా పోటీ నెలకొని ఉంది. సల్మాన్ ఖాన్, సొనాక్షి జంటగా రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చూసి.. తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అనుకోగానే దర్శకుడుగా హరీష్ శంకర్ అయితే బాగుంటుందనుకున్నారు. ఇందులో హీరోగా నటించడంతోపాటు స్వయంగా తనే నిర్మించాలని కూడా అనుకున్నారు. అందుకని 'పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్" బేనర్‌ను ఆరంభించారు. తెలుగులో ఈ చిత్రానికి 'గబ్బర్ సింగ్" అనే టైటిల్‌నుఖరారు చేశారు.
కాగా ఈ చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేయాలని సంచలన నటుడు శింబు చాలా ఉత్సాహంగా ఉన్నారు. హిందీలో సల్మాన్‌ఖాన్ నటించిన దబంగ్ లోని పోలీసు అధికారి పాత్రను శింబు చేయనున్న విషయం అధికారికంగా ఖరారైంది. ఇంతకు ముందు ధనుష్, జెనీలియా జంటగా ఉత్తమ పుత్తిరన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలలో ఒకరైన టి.రమేష్ బాలాజీ రియల్ మీడియా పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు.
దీని గురించి ఆయన తెలుపుతూ తమిళంలో ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో హీరోగా శింబు నటించనున్నారని తెలిపారు. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందన్నారు. షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా ప్రస్తుతం వానం చిత్రంలో నటిస్తున్న శింబు తదుపరి చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రంలో నటించడానికి శింబు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.


Click it and Unblock the Notifications











