బన్నీ లాగే స్టార్ ఇమేజ్ కోసం తనూ అతన్నిడామినేట్ చేశాడు..?
వేదం సినిమాలో నటించినందకు చాలా బాధ పడిపోయిన మంచు మనోజ్ లానే ఇప్పుడు ఆ చిత్రం తమిళ వెర్షన్ 'వానం"లో నటించిన భరత్ కూడా కుమిలిపోతున్నాడు. 'వేదం" కథని అల్లు అర్జున్ కోసం ఆల్టరేషన్ చేసి, మనోజ్ సీన్లని కత్తిరించి పారేశారని అప్పట్లో ఆరోపణ. దీనిపై తన నిరసనని వ్యక్తం చేయడమే కాకుండా, తన పాత్రని అతిథి పాత్రగా పరిచయం చేయాలని మనోజ్ పట్టు పట్టాడు.
తమిళంలోనూ ఈ చిత్ర దర్శకుడు క్రిష్ అక్కడ అల్లు అర్జున్ పాత్రు చేసిన శింబు డిమాండ్లకి తలొంచేశాడు. భరత్ క్యారెక్టర్ ని పూర్తిగా కుదించేసి, శింబునే హీరోగా చూపించాడు. దాంతో భరత్ తను చేసిన తప్పుకి చెంపలువాయించుకుంటూ ఇక జీవితంలో ఇద్దరు హీరోలున్న సినిమాలో నటించనని అంటున్నాడు. కుర్ర హీరోలని పెట్టుకునే ఇంతగా ఇదైపోతున్నారంటే, నిజంగా ఇద్దరు సూపర్ స్టార్లని పెట్టి వాళ్ల ఈగోలని శాటిస్ ఫై చేస్తూ ఎప్పటికైనా సినిమా తీయగలరంటారా..?


Click it and Unblock the Notifications











