»   » హద్దులు దాటిన పిచ్చి అభిమానం.. ప్రాణాలతో చెలగాటమాడిన శింబు అభిమాని, క్రేన్‌‌కు వేలాడుతూ!

హద్దులు దాటిన పిచ్చి అభిమానం.. ప్రాణాలతో చెలగాటమాడిన శింబు అభిమాని, క్రేన్‌‌కు వేలాడుతూ!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    ప్రాణాలతో చెలగాటమాడిన శింబు అభిమాని, క్రేన్‌‌కు వేలాడుతూ!

    తమిళ స్టార్ హీరో శింబుకు భారీ స్థాయిలోనే అభిమానగణం ఉంది. అతడి సినిమాలు విజయం సాధించినా, నిరాశపరిచిన శింబుని అభిమానించేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. శింబు నటించిన మణిరత్నం చిత్రం చెక్కా చివంత వానం చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ తో విజయపథంలో దూసుకుపోతోంది. శింబు నటించిన సినిమాల విడుదల సందర్భంగా అభిమానులు హంగామా చేయడం సాధారణమే. కానీ ఓ అభిమాని ప్రాణాలతో చెలగాటమాడుతూ చేసిన విన్యాసం విమర్శలకు తావిస్తోంది.

    హిట్ టాక్‌తో జోరు

    హిట్ టాక్‌తో జోరు

    మణిరత్నం చాలా కాలం తరువాత ఓ పవర్ ఫుల్ స్టోరీతో వచ్చాడు. ఆయన తెరకెక్కించిన చెక్క చివంత వానం చిత్రం విజయపథంలో దూసుకుపోతోంది. ఏ చిత్రంలో శింబు నటనకు అద్భుతమైన స్పందన వస్తోంది.

    హద్దులు దాటిన అభిమానం

    హద్దులు దాటిన అభిమానం

    ఈ చిత్ర విడుదల సందర్భంగా శింబు అభిమాని చేసిన సాహసం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఈ ఘటన వేలూరులో జరిగినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న మణిరత్నం దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలయింది. విడుదల సందర్భంగా అభిమాని ఒకరు శింబు కటౌట్ కు పాలాభిషేకం చేయడానికి ప్రాణాలతో చెలగాటమాడుతూ కనిపించాడు.

    క్రేన్‌‌కు వేలాడుతూ

    థియేటర్ ముందు ఉంచి శింబు భారీ కటౌట్ కు పాలాభిషేకం చేయడానికి అభిమాని ఒకరు క్రేన్ కు వేలాడుతూ కనిపించాడు. క్రేన్ కు వేలాడుతూ కటౌట్ పైకి చేరుకొని పాలాభిషేకం చేశాడు. కింద అభిమానులు డప్పులు వాయిస్తూ పెద్దఎత్తున సంబరాలు చేశారు.

    పెద్ద ఎత్తున విమర్శలు

    పెద్ద ఎత్తున విమర్శలు

    ఈ ఘటనపై పలువురు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై శింబు స్పందించాలి ఉంది. శింబు ప్రస్తుతం అత్తారింటికి దారేది రీమేక్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

    English summary
    Simbu fan hangs from crane to celebrate Chekka Chivantha Vaanam. One of Simbu's crazy fans hooked himself to a crane to pour milk on the actor's poster
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more