శింబుతో.. ఆర్య ఫైట్ చేయబోతున్నాడా?

తమిళ హీరో శింబు గతంతో పోలిస్తే 2019లో వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. తెలుగు సూపర్ హిట్ మూవీ 'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్‌లో నటించిన శింబు మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయిన వెంటనే తన మాజీ ప్రియురాలు హన్సిక నటిస్తున్న 50వ చిత్రం 'మహా'లో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.

'మహా' తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'మానడు' అనే తమిళ చిత్రంలో శింబు నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సురేష్ కమాట్చి నిర్మిస్తారు. ఈ సినిమా తర్వాత కన్నడ సూపర్ హిట్ ఫిల్మ్ 'మఫ్టి' తమిళ రీమేక్‌‌లో శింబు చేయబోతున్నట్లు సమాచారం.

Simbu to fight it off with Arya in Mufti Tamil remake?

'మఫ్టి' తమిళ రీమేక్ స్టూడియో గ్రీన్ బేనర్లో కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించబోతున్నారు. కన్నడలో 'మఫ్టి' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నార్తన్‌ను తమిళ వెర్షన్ కూడా దర్శకత్వం వహించేలా ఒప్పించడానికి జ్ఞానవేల్ రాజా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం మరో తమిళ స్టార్ ఆర్యను కీలక పాత్ర కోసం ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. శింబు.. ఆర్య మధ్య ఫైట్ సీన్స్ కూడా ఉంటాయని టాక్. ఆర్యతో పాటు అథర్వతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.

కన్నడ 'మఫ్టి' చిత్రం 2017లో విడుదలైంది. శివరాజ్ కుమార్, శ్రీమురళి ముఖ్యపాత్రల్లో నటించారు. కన్నడనాట మంచి విజయం అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఒక అండర్ కవర్ పోలీస్... ఒక భయంకరమైన అండర్ వరల్డ్ లీడర్ కోసం అన్వేషించే కథతో సాగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X