హీరో శింబుకు ఫైనల్ వార్నింగ్.. స్పందించకుంటే ఆస్తులు గల్లంతే!

Recommended Video

Simbu Gets Final Alerts From Court

తమిళ హీరో శింబుకు వివాదాలు కొత్త కాదు. శింబుకు తమిళనాడు వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. కెరీర్ ఆరంభం నుంచి శింబు తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నాడు. వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. తాజగా శింబు మెడకు మరో వివాదం చిక్కుకుంది. కోర్టు నుంచి శింబుకు తుది ఆదేశాలు అందాయి. స్పందించకుంటే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించడం గమనార్హం. గతంలో శింబు ఓ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ వ్యవహారమే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.

50 లక్షలు అడ్వాన్స్

50 లక్షలు అడ్వాన్స్

2013 లో శింబు ఫ్యాషన్ మూవీ మేకర్స్ సంస్థ నుంచి అరసన్ అనే చిత్రం కోసం 50 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. కానీ ఇంతవరకు నిర్మాతలకు కాల్ షీట్స్ కేటాయించలేదు. దీనితో నిర్మాతలు నేరుగా కోర్టులో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.

పెడచెవిన పెట్టాడు

పెడచెవిన పెట్టాడు

గత నెలలో ఈ కేసు కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా నిర్మాతలకు తీసుకున్న మొత్తానికి వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. ఎప్పుడు చెల్లిస్తాడో చెప్పడానికి శింబుకు న్యాయస్థానం నాలుగు వారాల గడువు ఇచ్చింది. నాలుగు వారాలలోగా వివరాలు తెలపకుంటే శింబుకు చెందిన కారు, మొబైల్ ఫోన్ వంటి వస్తువులని స్వాధీనపరుచుకుంటాం అని కోర్టు హెచ్చరించింది. అయినా కూడా కోర్టు ఆదేశాల్ని శింబు ఖాతరు చేయలేదు.

 ఏకంగా ఆస్తులే

ఏకంగా ఆస్తులే

తాజగా బుధవారం రోజు ఈ కేసు మరోమారు మద్రాసు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం శింబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాతలకు చెల్లించాల్సి మొత్తం వడ్డీతో కలిపి 85 లక్షలు ఎప్పుడు చెల్లిస్తావో ఈ నెలాఖరులోగా వెల్లడించాలని ఆదేశించింది. లేకుంటే ఆస్తులు జప్తు చేస్తాం అని కోటు తుది హెచ్చరికలు జారీ చేసింది.

రీమేక్ చిత్రంలో

రీమేక్ చిత్రంలో

కోర్టు ఆదేశాల నేపథ్యంలో శింబు ఇంకా స్పందించలేదు. శింబు ప్రస్తుతం అత్తారింటికి దారేది రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. సుందర్ సి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చాలా కలం తరువాత శింబు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నవాబ్ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X