400మందికి స్టార్ హీరో బంగారు కానుకలు.. దీపావళికి ఇదే బిగ్ సర్ ప్రైజ్
కొంతమంది హీరోలు చాలా వరకు వారి మంచి మనసుతోనే అభిమానులకు ఎక్కువగా ఆకట్టుకుంటారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అలాంటి హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. సంపాధించిన దాంట్లో ఎంతో కొంత మళ్ళీ జనాల కోసమే వాడుతుంటారు. ఇక అలాంటి లిస్ట్ లో అప్పుడప్పుడు శింబు కూడా నిలుస్తు ఉంటాడు. ఈ ప్లే బాయ్ కాంట్రవర్సీలతోనే కాకుండా కొన్నిసార్లు ఊహించని విధంగా మంచి పనులతో కూడా ఎట్రాక్ట్ చేస్తుంటాడు.

కానుకలతో సర్ ప్రైజ్ ఇచ్చిన హీరో
శింబు గురించి ఏదైనా న్యూస్ వచ్చింది అంటే నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉంటాడనే ఒక టాక్ ఉంది. ఇక లవ్ స్టోరీలతో ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల ఈ యువ ఎవరు ఊహించని విధంగా దీపావళికి 400 మందికి కానుకలతో సర్ ప్రైజ్ ఇచ్చాడు.

దీపావళికి గోల్డ్ కాయిన్స్
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం శింబు ఈశ్వరుడు అనే ఒక డిఫరెంట్ యాక్షన్ డ్రామా సినిమాతో రెడీ అవుతున్నాడం ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ సినిమాకు పని చేసిన దాదాపు 400 మందికి అలా గ్రాము గోల్డ్ కాయిన్ అలాగే కొత్త బట్టలు కానుకగా ఇచ్చాడట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

మరో రెండు వందల మందికి
ఇక మరో 200 మంది జూనియర్ ఆర్టిస్టులకు కూడా శింబు కొత్త బట్టలు పంపినట్లు తెలుస్తోంది. శింబు గతంలో కూడా కొన్ని సినిమాలకు పని చేసిన చిత్ర యూనిట్ కొంత ఆర్థిక సహాయం చేశాడు. పంగలకు గిఫ్ట్ లు ఇవ్వడం శింబుకు చాలా అలవాటు. ఇక చాలా రోజుల తరువాత నాలుగు వందల మందికి గోల్డ్ కాయిన్ ఇవ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

హీరోయిన్ త్రిషతో పెళ్లి..?
ఇక సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా శింబు పెళ్లిపై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఇద్దరు సమ్మతితో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలు ఎంత వైరల్ అవుతున్నా కూడా ఇంకా అభిమానుల కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయలేకపోతున్నాయి.


Click it and Unblock the Notifications











