For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్లేబోయ్ హీరోతో హన్సిక రొమాన్స్

  By Srikanya
  |

  చెన్నై : తెలుగు,తమిళ భాషల్లో హన్సిక బిజీ స్టార్ గా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తమిళనాట ప్లే బోయ్ హీరోగా పేరొందిన శింబు సరసన తమిళంలో 'వాలు' పేరుతో రూపొందుతున్న చిత్రంలో చేస్తోంది. విజయచంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నందినీ ఫిలిమ్స్ అధినేత ఎస్‌వీరావు తెలుగు హక్కులను పొందారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హన్సిక పాత్ర సినిమాకు కీలకమై నిలుస్తుందని,ఆమె అబిమానులను అలరిస్తుందని చెప్తున్నారు.

  ఈ చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ 'తమిళంలో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలున్నాయి. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం దీపావళికి తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది. ఇంతకు ముందు చేయనటువంటి ఓ వైవిధ్యమైన పాత్రను శింబు ఈ చిత్రంలో చేస్తున్నాడు. హన్సిక అందచందాలు కుర్రకారును ఆకట్టుకుంటాయి. తెలుగులో ఈ చిత్రం ద్వారా శింబు స్టార్ హీరోల జాబితాలో చేరతాడు' అన్నారు. బ్రహ్మానందం, సంతానం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్.

  మరో ప్రక్క ఆమె మంచు విష్ణు వర్ధన్ తో చేస్తున్న 'దేనికైనా రెడీ' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. విష్ణు, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా.మోహన్‌బాబు సమర్పణలో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో వున్న ఈ చిత్రం విశేషాలను డా.మోహన్‌బాబు తెలియజేస్తూ ' చక్కనైన కుటుంబ కథాంశంతో పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. ఆగస్టు 24 నుంచి ఈ నెల 6వరకు విష్ణు, హన్సికలపై ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో యూరప్, థాయ్‌లాండ్‌లో మూడు పాటలు చిత్రీకరించాం. ఈ నెల 23న పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ...గుండెల నిండా తొణికిసలాడే ఆత్మవిశ్వాసం, ఎవరినైనా ఎదిరించగల ధైర్యం ఆ యువకుడి సొంతం. మంచికి మంచి, చెడుకు చెడు ఆ కుర్రాడి నైజం. భుజ బలంతో పాటు బుద్దిబలం కూడా మెండుగా వున్న ఆ చాకులాంటి కుర్రాడు తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేశాడు? శత్రువులు విసిరిన ప్రతి సవాల్‌ను ఎదుర్కొంటూ 'దేనికైనా రెడీ' అంటూ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? ఇలాంటి ఆసక్తిరమైన కథాంశానికి వినోదాన్ని జోడించి జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'దేనికైనా రెడీ'. అలాగే .. 'విష్ణు పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం వుంటుంది. 'ఢీ' చిత్రంలో తన కామెడీ టైమింగ్‌తో విష్ణు ప్రేక్షకులను ఎంతగా అలరించాడో.. ఈ చిత్రంలో అంతకు పదింతలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. ముఖ్యంగా చిత్రంలోని పోరాట సన్నివేశాలు కూడా కొత్తగా వుంటాయి' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం చక్రి.

  English summary
  Simbu and Hansika Motwani who are currently acting in Vettai Mannan, have joined hands for another film titled Vaalu. Incidentally both the films, Vettai Mannan and Vaalu are being produced by S S Chakravarthy of NIC Arts.While Vettai Mannan, a gangster flick, is being directed by Nelson, Vaalu will be helmed by newcomer Vijay. The new project is being touted as an action-comedy, and will bring together Simbu, Santhanam and VTV Ganesh after Vaanam and Osthi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X