Don't Miss!
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్‌కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మాజీ ప్రియుడితో హన్సిక మరోసారి.. వైరల్ అవుతున్న హాట్ న్యూస్!
ఆపిల్ పిల్లగా యువత హృదయాల్లో గూడు కట్టుకున్న హన్సిక తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టీనేజ్ వయసులో దేశముదురు చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి అందాలు ఆరబోసింది. ఆ ఆపిల్ బ్యూటీ గ్లామర్ కు యువత ఫిదా అయిపోయారు.ప్రస్తుతం హన్సిక తమిళ చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోంది. అది కూడా గ్లామర్ తగ్గించేసి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం హన్సిక హర్రర్ నేపథ్యంలో మహా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది.
50వ చిత్రం
హన్సిక మహా చిత్రాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటిస్తోంది. ఎందుకంటే మహా హన్సికకు 50వ చిత్రం. హర్రర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్స్ చిత్రానికి మంచి బజ్ తీసుకుని వచ్చాయి. అలాగే వివాదాలు కూడా సృష్టించాయి. మొత్తంగా హన్సిక 50వ చిత్రానికి అవసరమైన పబ్లిసిటీ మాత్రం లభిస్తోంది.
మాజీ ప్రియుడు గెస్ట్ రోల్
ఈ చిత్రానికి మరింత క్రేజ్ తీసుకుని వచ్చేలా మరో న్యూస్ వైరల్ అవుతోంది.హన్సిక మాజీ ప్రియుడు శింబు ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. శింబు మహా చిత్రంలో ఓ సన్నివేశంతో పాటు, ఓ సాంగ్ లో కూడా కనిపిస్తాడట. చిత్ర దర్శకుడు జమీల్ కోరిక మేరకు హన్సికతో ఉన్న విభేదాలని పక్కన పెట్టి ఈ చిత్రంలో నటించేందుకు శింబు అంగీకరించాడట. హన్సిక కూడా అభ్యంతరం చెప్పలేదని అంటున్నారు.
పెళ్లి వరకు వచ్చి
కొన్నేళ్ల క్రితం శింబు, హన్సిక మధ్య ఘాడమైన ప్రేమ కొనసాగింది. వీరిదరో తమ రిలేషన్ ని అధికారికంగా ప్రకటించారు కూడా. పెళ్లికి సిద్ధం అవుతున్నారు అని అనుకుంటున్న తరుణంలో శింబు, హన్సిక విడిపోయారు. నయనతార తర్వాత శింబు జీవితంలో జరిగిన రెండవ బ్రేకప్ ఇది. శింబు, హన్సిక కలసి వెట్టై మానమ్ చిత్రంలో నటించారు.
నయనతారతో కూడా
శింబు తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని కలిపి చూడదని మరోమారు రుజువైంది. నయనతార, శింబు కూడా విడిపోయారు. నయన్ నుంచి విడిపోయాక శింబు ఆమెతో కలసి సరసుడు చిత్రంలో నటించాడు. ఇప్పుడు హన్సిక చిత్రంలో కూడా నటించబోతున్నాడు. మహా చిత్ర పోస్టర్ లో సాధువు వేషంలో హన్సిక సిగరెట్ తాగుతూ కనిపించడం వివాదంగా మారింది.