దర్శకుడు లింగుస్వామిపై విరుచుకుపడ్డ స్టార్ హీరో
పందెంకోడి, ఆవారా, రన్ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ముద్రవేసుకున్న లింగు స్వామి వివాదాల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకత సృష్టించేపనిలో ఉన్నారు. ఇంతకుముదు నయనతారతో గొడవ అయిన లింగు స్వామి తాజాగా ఆమె మాజీ లవర్ శింబుతో తాజాగా గొడవకు దిగారు. శింబుని ఆయన తన స్వంత బ్యానర్ పై నిర్మించే చిత్రం కోసం బుక్ చేసుకున్నారు.భూపతి పాండ్యన్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తారని చెప్పి డేట్స్ తీసుకున్నారు. అయితే తర్వాత మాట మార్చి దయానిధి అజగిరి నిర్మాతగా ఉంటారని తాను డైరక్ట్ చేస్తానని అన్నారు. అప్పటికీ ఓకే అన్నాక కథ కూడా చెప్పకుండా షూటింగ్ కి శింబుని రెడీ అవమన్నాడు. దాంతో కాలిన శింబు తన డేట్స్ ని వేరే చిత్రానికి కేటాయించాడు. ఇది గమనించిన లింగు స్వామి వెంటనే హీరోని మార్చి ప్రకటన చేసాడు. దాంతో సింబు...పత్రికలకు ఓ ప్రకటన రిలీజ్ చేసాడు. తను టెక్నికల్ గా ఏ మిస్టీక్ చేయలేదని, లింగు స్వామి వినిపించే స్క్రిప్టు కోసం వంద రోజులుకు పైగా వేచి ఉన్నానని ఆ తర్వాతనే వానం అనే సినిమా ఓప్పుకున్నానని ఇందులో తన తప్పు ఏమీ లేదని, అయినా స్క్రిప్టు లేకుండా నిర్మాతను అడ్డం పెట్టి సినిమా చేయాలనుకోవటం పద్దతి కాదని అన్నాడు. అలాగే తనను తొలిగిస్తూ ఏక పక్షంగా లింగుస్వామి నిర్ణయం తీసుకోవటం తనను షాక్ కు గురిచేసిందని, నేను సెప్టెంబర్ నుంచి ప్రీగా ఉన్నానని క్లియర్ గా చెప్పానని, ఇది వృత్తి పరంగా చాలా భాద్యతా రాహిత్యమని ఇది క్షమించే సంటన కాదని అన్నారు. దీనిపై లింగు స్వామి ఏ వివరణ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











