అత్తారింటికి దారేది రీమేక్.. శింబు అల్ట్రా స్టైలిష్ లుక్ లీక్!
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది ప్రస్తుతం తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ తెరకెక్కిస్తున్నాడు. శింబు ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండడం విశేషం. అత్తారింటికి దారేది చిత్రం ఘనవిజయం సాధించడంతో పరభాషా దర్శకుల కన్ను ఈ చిత్రంపై పడింది. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ ధర వెచ్చించి అత్తారింటికి దారేది తమిళ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారు.

జార్జియాలో స్టార్ట్
తమిళ రీమేక్ జార్జియాలో ప్రారంభమైంది. దర్శకుడు సుందర్ హీరో పరిచయ సన్నివేశాలని అక్కడ చిత్రీకరించనున్నారు. తెలుగు వర్షన్ లో సమంత కథానాయికగా నటించింది. తమిళంలో మేఘా ఆకాష్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.

శింబు లుక్ లీక్
తాజగా ఈ చిత్రంలో శింబు లుక్ లీక్ అయింది. షూటింగ్ లొకేషన్స్ నుంచి లీకైన స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శింబు స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. శింబు హెయిర్ స్టయిల్, గడ్డం, మీసాలు స్టైలిష్ గ ఉంటూ చూడగానే ఆకర్షించే విధంగా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్‌ని మురిపించేలా
అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ ని త్రివిక్రమ్ స్టైలిష్ గా చూపించాడు. పవన్ బాడీ లాంగ్వేజ్ విభిన్నంగా ఉంటుంది. అలాంటి పాత్రలో శింబు ఎలా నటిస్తాడనేది ఆసక్తిగా మారింది. అత్తారింటికి దారేది చిత్రంలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ బాగా పేలాయి.

అత్త పాత్రలో ఎవరు
ఇక అత్తారింటికి దారేది చిత్రంలో అత్త పాత్ర చాలా కీలకం. తెలుగులో నదియా నటించింది. తమిళంలో దర్శకుడు సుందర్ సతీమణి ఖుష్బూ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా మలయాళీ నటి ఐశ్వర్య లక్ష్మిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











