‘భారతీయుడు 2’లో కీలక పాత్రలో ఆ యంగ్ హీరో కూడా?
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో త్వరలో 'ఇండియన్ 2' (భారతీయుడు 2) రాబోతున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తమిళ నటుడు శింబు కూడా కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. శింబు నటించడానికి ఒప్పుకున్నాడని, అయితే డేట్స్ కేటాయించి ఇంకా సైన్ చేయలేదని టాక్. ఇందులో అతడు పోలీస్ పాత్రలో నటిస్తాడని అంటున్నారు. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఫైనల్ దశలో ఉంది. దీనిపై రచయితలు కాబిలన్ వైరముత్తు, జయమోహన్, లక్ష్మీ శరవణకుమార్ పని చేస్తున్నారు, త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నారట. ముఖ్యమైన సన్నివేశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీని మొదట దిల్ రాజు నిర్మించాలనుకున్నారని, అతడు తప్పుకున్న తర్వాత లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఓ ప్రెస్ మీట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ... 'ఇండియన్' కంటే 'ఇండియన్ 2'లో మరింత పవర్ ఫుల్ డైలాగులు ఉంటాయని తెలిపారు. ఈ సినిమాకు రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారు. '2.0' సినిమా విడుదల తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. ఆల్రెడీ సెట్స్ నిర్మాణ పనులు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











