నయనతార, హన్సిక బ్రేకప్స్ కంటే.. ‘కావేరి’ విషయంతో శింబు కంటతడి.. గుండె పగిలింది!
Recommended Video

టాలీవుడ్ స్టార్ శింబు అలియాస్ సిలంబరాసన్‌కు అఫైర్లు, బ్రేకప్స్ ఎక్కువనేది అందరికీ తెలిసిందే. గతంలో నయనతార, హన్సికతో ప్రేమాయణాలు పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయాయి. శింబు బ్రేకప్స్ గురించి ఇటీవల తన స్నేహితుడు మహత్ రాఘవేంద్ర ఓ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ఇద్దరు హీరోయిన్లతో బ్రేకప్ జరిగిన సమయంలో శింబు ఎలా వ్యవహరించారంటే..

నయనతార, హన్సికతో పీకల్లోతు ప్రేమ
గతంలో నయనతారతో పీకల్లోతు ప్రేమలో శింబు మునిగిపోయాడు. వారిద్దరూ ప్రతీచోట చెట్టాపట్టాలేసుకొని కనిపించారు. అలా కొన్నేళ్లు తిరిగిన తర్వాత అనూహ్యంగా విడిపోయారు. నయనతారతో విడిపోయిన తర్వాత శింబు మరోసారి ప్రేమలో పడ్డాడు. హన్సికతో అఫైర్ మీడియాలో ప్రముఖంగా కనిపించింది. అయితే కొద్దినాళ్లకే వారిద్దరి బ్రేకప్ జరిగింది. అయితే ఈ రెండు బ్రేకప్‌లు జరిగినప్పుడు శింబు పెద్దగా పట్టించుకోలేదని మహత్ రాఘవ వివరించడం గమనార్హం.

కావేరి వివాదంతో బాధ
కావేరి వివాదం సమయంలో శింబు విడుదల చేసిన వీడియోపై పలువురు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆ విమర్శలు అతడిని చాలా బాధించాయి. పలువురు హీరోయిన్లతో బ్రేకప్ జరిగిన సమయంలో కూడా శింబు అంతగా బాధపడలేదు అని మహత్ రాఘవ వెల్లడించారు.

బ్రేకప్స్ జరిగిన సమయంలో శింబు
ప్రేమ వ్యవహారాలు విఫలమైనప్పుడు చాలా మంది గుక్కపెట్టి ఏడుస్తారు. విషాదంలో కూరుకుపోతారు. వారిలో ఉండే ఎమోషన్స్‌ను బయటకు వెళ్లగక్కుతారు. కానీ ఎన్ని బ్రేకప్స్ జరిగినా శింబు మనోధైర్యంతో ఉన్నాడు. కానీ కావేరి జలాల వివాదానికి సంబంధించిన వీడియోను తప్పుపట్టినప్పుడు విపరీతంగా కంటతడి పెట్టుకొన్నాడు అని మహత్ రాఘవ చెప్పాడు.

కావేరి వివాదంపై విమర్శలు
తాను విడుదల చేసిన వీడియోపై ప్రతీ ఒక్కరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడంతో శింబు నొచ్చుకొన్నారు. దాంతో గుండె పగిలింది. ప్రతీ ఒక్కరు సరైన విధంగా ఆలోచించడం లేదని బాధపడ్డారు. కావేరి జలాల వివాదం శింబును బాగా కుంగదీసింది అని మహత్ రాఘవ చెప్పుకొచ్చారు.

శింబు అడుక్కోకని కామెంట్లు
కావేరి జలాల వివాదంలో కన్నడిగులు, తమిళులంతా కలిసి కట్టుగా ఉండాలి. సామరస్య ధోరణితో వివాదాన్ని పరిష్కరించుకోవాలి. ఇలా శింబు అభ్యర్థించడాన్ని తమిళులు తప్పుపట్టారు. శింబు అడుక్కొనే పనిలో పడ్డారు అని నెటిజన్లు విసిరారు. దాంతో శింబు మనోవేధనకు లోనయ్యారట.


Click it and Unblock the Notifications











