జగన్ కామెడికి నవ్వు రావడంలేదన్న స్టార్ హీరో..
తెలుగు 'వేదం" తమిళంలో శింబు, భరత్, అనుష్క తదితరుల కాంబినేషన్ లో 'వానం"గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల పూర్తయ్యింది. సినిమా రషెస్ చూసి శింబు ఖంగు తిన్నాడట. కామెడీ ట్రాక్ చాలా చప్పగా ఉందని, నవ్వు రావడంలేదని భావించాడు శింబు. ఈ పాత్రలో హాస్యనటుడు జగన్ నటించాడట. నవ్వించలేని కామెడీ ట్రాక్ ఏం బాగుంటుందని అనుకున్న శింబు జగన్ స్థానంలో సంతానంని తీసుకుని మళ్లీ కామెడీ ట్రాక్ షూట్ చేయించాడట. అప్పటికప్పుడు డేట్స్ అడగడం తో సంతానం ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసి తీసుకున్నాడట.


Click it and Unblock the Notifications











