మాజీ ప్రేయసితో శింబు రొమాన్స్.. మళ్లీ ఒక్కటైన జంట.. స్వయంగా ఆమెనే!

Recommended Video

Simbu Joins Ex-girlfriend Hansika At Maha Movie Shooting || Filmibeat Telugu

తమిళ స్టార్ హీరో శింబు, అందాల భామ హన్సిక గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. అయితే పెళ్లి పీటలు ఎక్కుతారని భావించిన వారందరికీ షాకిస్తూ.. బ్రేకప్ చెప్పుకొన్నారు. అప్పట్లో హన్సిక, శింబు బ్రేకప్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శింబు ఓ రకమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఒకరికొకరు ముఖాలు చూసుకొన్న దాఖలాలు కూడా లేవు. కానీ వారిద్దరూ ఇప్పుడు యుఆర్ జమీల్ అనే దర్శకుడు రూపొందించే సినిమా మహా కోసం ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే...

హన్సిక 50వ చిత్రంలో శింబు

హన్సిక 50వ చిత్రంలో శింబు

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ హన్సికకు మహా 50వ చిత్రం. ఈ చిత్రంలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో శింబు అతిథిగా కనిపిస్తారంట. అయితే దర్శకుడు జమీల్‌‌తో చర్చల సందర్భంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో శింబు నటిస్తే బాగుంటుందని హన్సిక స్వయంగా సూచించారట. దాంతో శింబు మరోసారి హన్సికతో జతకట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ సినిమాకు ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్ కీలకంగా ఉంటుందనేది యూనిట్ వర్గాల అభిప్రాయం.

హన్సిక కోసం శింబు అతిథి పాత్ర

హన్సిక కోసం శింబు అతిథి పాత్ర

మహాలో శింబును తీసుకోవడంపై దర్శకుడు జమీల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహాలో అతిథి పాత్రకు ఎవరైతే బాగుంటుందని భావిస్తున్న తరుణంలో హన్సిక స్వయంగా శింబు పేరు సూచించారు. ఆమె శింబుతో మాట్లాడింది. ఆ పాత్రలో నటించడానికి ఒప్పించింది. దాంతో శింబు ఈ సినిమాలోకి ఎంట్రీ అయ్యాడు అని జమీల్ పేర్కొన్నారు.

చేతిలో చేయి వేసుకొని ఫొటో

చేతిలో చేయి వేసుకొని ఫొటో

మహాలో శింబు నటిస్తున్నట్టు హన్సిక తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఇద్దరు చేతిలో చేయి వేసుకొని ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. శింబుతో కలిసి నటిస్తున్నారనే వార్త మేము వెల్లడించకముందే లీక్ అయింది. మీడియాలో ఆ వార్త వైరల్‌గానూ మారింది. నేను, శింబు మహా కోసం జతకట్టింది నిజమే అని హన్సిక ఓ పోస్టులో వెల్లడించింది. వారిద్దరు కలిసి నటించడంపై అభిమానులు దిల్ కుష్ అవుతున్నారు.

 రొమాంటిక్‌గా హన్సిక, శింబు

రొమాంటిక్‌గా హన్సిక, శింబు

మహా సినిమా షూటింగ్ ఇటీవల అందమైన లోకేషన్లలో ప్రారంభమైంది. దర్శకుడు జమీల్, హన్సిక, శింబు కలిసి షూటింగ్ స్పాట్‌లో ఫొటోకు ఫోజిచ్చారు. వారిద్దరిపై రొమాంటిక్ సాంగ్‌ను షూట్ చేస్తున్నట్టు సమాచారం. హన్సిక, శింబు షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రంలో శ్రీకాంత్, తంబి రామయ్య, కరుణాకరణ్, నాజర్, జయప్రకాశ్, ఛాయసింగ్ తదితరులు నటిస్తున్నారు. జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తుండగా, మాథీ అజగన్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X