నయనతార, శింబు ప్రైవేట్ పిక్స్ లీక్.. లీక్ చేసింది శింబునేనా? సంచలనంపై ఎట్టకేలకు నోరు విప్పాడు!
తమిళ రొమాంటిక్ హీరో శింబుని ఎప్పుడూ ఎదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంటుంది. శింబు నటించే సినిమాలు కూడా వివాద భరితంగానే ఉంటాయి. అతడి వ్యక్తిగత జీవితం కూడా వివాదాల మయం. కెరీర్ లో పడుతూ లేస్తోనే శింబు నిలదొక్కుకుంటున్నాడు. కొన్నేళ్ల క్రితం శింబు ప్రేమ వ్యవహారాలు మీడియాలో పేరు దుమారం రేపాయి. నయనతార, హన్సిక వంటి తారలతో ఈ రొమాంటిక్ హీరో చాలా కాలం పాటు ప్రేమ వ్యవహారాలు సాగించాడు. నయనతార విషయంలో జరిగిన ఓ వివాదం గురించి శింబు ఎట్టకేలకు నోరు విప్పాడు.

ప్రైవేట్ ఫోటోలు లీక్
నయనతార, శింబు కలసి వల్లభ చిత్రంలో నటించారు అప్పటినుంచే వీరి మధ్య ప్రేమాయణం మొదలైందనే వార్తలు ఉన్నాయి. చాలా కాలం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఓ సందర్భంలో నయనతార, శింబు ప్రైవేట్ గా కలసి ఉన్న ఫోటోలు లీకై పెను దుమారం సృష్టించాయి.

అతిపెద్ద వివాదం
శింబు కెరీర్ లో ఈ ఘటన అతిపెద్ద వివాదంగా మారింది. ఆ ఫోటోలు ఇంటర్ నెట్ లో వైరల్ గా మారి తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఈ పరిస్థితి అటు నయనతారకు, ఇటు శింబుకు ఇద్దరికీ ఇబ్బందికరంగానే మారింది.

శింబు పనే అంటూ
అప్పట్లో జరిగిన ప్రచారం ప్రకారం ఆ ఫోటోలు శింబునే లీక్ చేయించాడనే విమర్శలు కూడా ఎదురయ్యాయి.ఈ వివాదం వలన పెళ్లి వరకు వచ్చిన వ్యవహారం అంతటితోనే ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. ఈ వివాదం తరువాత శింబు కెరీర్ లో కూడా బాగా జోరు తగ్గింది.

ఎట్టకేలకు
తన కెరీర్ ని కుదిపేసిన ఈ ఘటనపై శింబు ఎట్టకేలకు నోరు విప్పాడు. తామిద్దరం దుబాయ్ లో ఉన్న సమయంలో కొత్త కెమెరా తీసుకున్నాం. ఆ సమయంలో తీసిన పిక్స్ అవి. అవి తనకు తెలియకుండా ఎవరో లీక్ చేసారని శింబు తెలిపాడు.

చాలా బాధించింది
ఆ ఫోటోలు ఎవరు లీక్ చేశారో తెలియదు. కానీ తన వలన ఓ అమ్మాయి ఇబ్బంది పడడం చాలా బాధించిందని శింబు తెలిపాడు. తన జీవితంలో ఇంతవరకు ఏ అమ్మాయిని కూడా ఆమె అనుమతి లేకుండా ముట్టుకోలేదని శింబు తెలిపాడు.


Click it and Unblock the Notifications











