ముస్లిం యువతితో శింబు తమ్ముడు.. సంచలన నిర్ణయానికి కారణం ఇదే!
తమిళ స్టార్ హీరో శింబు కుటుంబం తరచుగా ఏదో ఒక వార్తల్లో ఉండాల్సిందే. వివాదాలు ఈ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. శింబుతో పాటు అతడి తండ్రి టి రాజేందర్ కూడా తరచుగా వివాదాల్లో చిక్కుకుంటుంటారు. గత కొన్ని వారాలుగా శింబు సోదరుడు కురలరాసన్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇతగాడి ప్రేమ వ్యవహారం ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిగురించి శింబు కుటుంబసభ్యులెవరూ స్పందించకున్నా మీడియాలో మాత్రం వార్తలు వస్తున్నాయి.

కొన్ని వారాల క్రితమే
శింబు తమ్ముడు కురలరాసన్ కొన్ని వారాల క్రితమే ఇస్లాం మతంలోకి మారిన సంగతి తెలిసిందే. తండ్రి టి రాజేందర్ సమక్షంలోనే కురలరాసన్ ఇస్లాం స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది. కురలరాసన్ తమిళ చిత్ర పరిశ్రమలో సింగర్ గా, సంగీత కొనసాగుతున్నాడు. శింబు, నయనతార నటించిన సరసుడు చిత్రానికి ఇతడే సంగీత దర్శకుడు.

తప్పేముంది
కురలరాసన్ ఇస్లాం స్వీకరించడంపై ఆ సందర్భంలో టి రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఇందులో తప్పేముంది.. మా కుటుంబం దృష్టిలో అన్ని మతాలు సమానమే అని అన్నారు. నా పెద్ద కొడుకు శింబు శివుడికి పరమ భక్తుడు. నా కుమార్తె అలేఖ్య క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తోంది. ఇప్పుడు నా చిన్న కొడుకు ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. అతడి నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా అని రాజేందర్ తెలిపారు.

ముస్లిం యువతితో
కురలరాసన్ ఇస్లాం స్వీకరించడానికి అతడి ప్రేమ వ్యవహారమే కారణం అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. కురలరాసన్ ఓ ముస్లిం యువతిని ప్రేమించాడట. పెళ్లి కోసం ఆమె కుటుంబ సభ్యులని అడిగితే తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇస్లాం మతంలోకి మారితే అంగీకరిస్తాం అని కండిషన్ పెట్టారట. తన ప్రేయసిని దక్కించుకోవడం కోసమే కురలరాసన్ ఇస్లాంలోకి మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ యువతి కుటుంబ సభ్యులు పెళ్ళికి అంగీకరించారట. త్వరలోనే కురలరాసన్ పెళ్లి ప్రకటన రానున్నట్లు తమిళ చిత్ర పరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మూడో సెలెబ్రిటీ
కోలీవుడ్ లో ఇస్లాం మతంలోకి మారిన మూడో సెలెబ్రిటీ కురలరాసన్. అంతకు ముందు ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజా ఇస్లాం మతాన్ని స్వీకరించారు. యువన్ శంకర్ రాజా అయితే ఏకంగా అబ్దుల్ హాలీక్ అని పేరే మార్చేసుకున్నాడు. ప్రేయసి కోసం ఇంత చేసిన కురలరాసన్ పేరుకూడా మార్చుకుంటాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











