శింబుతో లిప్ లాక్, రెచ్చిపోయిన బిగ్ బాస్ భామ.. వైరల్ అవుతున్న వీడియో!
హీరోయిన్ ఓవియా పేరు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో మారుమోగుతోంది. ఓవియా తమిళ బిగ్ బాస్ 1 లో పాల్గొంది. అంతకు ముందు కూడా ఓవియా హీరోయిన్ గా నటించింది. కానీ ఒవియాకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఓవియా జాతకం ఒక్కసారిగా మారిపోయింది. లక్షలాది మంది ఆమెకు అభిమానులుగా మారిపోయారు. ఈ షో తర్వాత ఓవియా నటించిన తొలి చిత్రం 90 ఎంఎల్. శుక్రవారం రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవియా తన అభిమానులందరికి షాక్ ఇస్తూ అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యావరేజ్ టాక్
శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 90 ఎంఎల్ చిత్రానికి తమిళ ప్రేక్షకులు, ఆడియన్స్ నుంచి యావరేజ్ టాక్ వస్తోంది. అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రంలో ఓవియా పెర్ఫామెన్స్ తో అదరగొట్టినా, కొన్ని సన్నివేశాలు హద్దులు దాటే విధంగా ఉన్నయ్యంటూ విమర్శలు తలెత్తుతున్నాయి. ఐదుగురు మహిళల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సంగీత దర్శకుడిగా
ఈ చిత్రానికి స్టార్ హీరో శింబు సంగీతం అందించడం విశేషం. మహిళా దర్శకురాలు అనిత ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బిగ్ బాస్ తో ఒవియాకు అమాంతం క్రేజ్ పెరిగింది. ఆమె క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో దర్శక నిర్మాతలు ఓవియాతో చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కాగా 90ఎంఎల్ చిత్రంలో శింబు అభిమానులకు సడన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఓవియా, శింబు కలసి ప్రేక్షకులని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
వైరల్ అవుతున్న వీడియో
90 ఎంఎల్ చిత్రంలో శింబు కామియో రోల్ లో నటించి ఆశ్చర్యపరిచాడు. నటించడమే కాదు శింబు, ఓవియా మధ్య ఘాటైన లిప్ లాక్ సన్నివేశం కూడా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పబ్ సన్నివేశంలో భాగంగా శింబు ఈ గెస్ట్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. తమిళ సినీ వర్గాల్లో ఓవియా, శింబు లిప్ లాక్ గురించే హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. శింబు ఎంతటి రొమాంటిక్ హీరోనో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో నయనతార, శింబు ఆన్ స్క్రీన్ రొమాన్స్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

శింబుతో ఓవియా ఎఫైర్
ఇదిలా ఉండగా శింబు, ఓవియా మధ్య ఘాటైన ఎఫైర్ సాగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వార్తల గురించి ఓవియా కూడా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శింబు తనకు మంచి స్నేహితుడని, జీవితాంతం అతడి తోడుని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించింది. దీనితో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు బలపడ్డాయి.


Click it and Unblock the Notifications











