పవన్ తో ఛాన్స్ కొట్టేసింది కానీ ఆ సూపర్ హీరోతో మిస్సయింది...!
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సల్మాన్ ఖాన్ చిత్రం 'దబాంగ్' ను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్రను తమిళ హీరో శింబు చేస్తున్నారు. ఇక ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ ను తీసుకోవాలని నిర్మాత సూచించాడు. అయితే కాజల్ అగర్వాల్ కు తన పక్కన నటించేంత సీన్ లేదని శింబు ఆమెను తొలగించి, ఆమె స్థానంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పేరు సుచించాడట. అయితే సోనాక్షి డేట్స్ కాలీగా లేవని ప్రస్తుతం సెల్వరాఘవన్ డైరెక్షన్ లో కమల్ హాసన్ సరసన నటిస్తోందని సోనమ్ కపూర్ శింబు సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఎలాగైతేనేం తమిళంలో శింబు పున్యమాఅని ఒక బాలీవుడ్ స్టార్ ని చూడొచ్చని కోలీవుడ్ అంతా ఆనందంలో మునిగిపోయారు.
లేటస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ధరణి దర్శకుడుగా చేపట్టబోతున్నట్టు సమాచారం. మొదట ఈ చిత్రానికి 'సరవనన్' డైరెక్టర్ అనుకొన్నారు. కాగా అధికారికంగా ప్రకటించాల్సివుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న గబ్బర్ సింగ్ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్ లో అవలీలగా ఛాన్సును కొట్టేసిన కాజల్, తమిళంలో మాత్రం దక్కించుకోలేకపోయింది. సోనమ్ కపూర్ లో నచ్చిందేమిటి...? కాజల్‌లో నచ్చనిదేమిటో...? శింబుకే తెలియాలి.


Click it and Unblock the Notifications











