శింబు-సెల్వరాఘవన్ మూవీ ‘కాన్’ ఫస్ట్ లుక్
హైదరాబాద్: ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ శింబు హీరోగా ‘కాన్' అనే చిత్రం రూపొందించబోతున్నాడు. తాజాగాఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా, తాప్సీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషను తీసుకోవాలనుకున్నప్పటికీ డేట్స్ కుదరలేదని టాక్.
యుగానికి ఒక్కడు, 7జి బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, వర్ణ లాంటి చిత్రాలను తెరకెక్కించిన సెల్వరాఘవన్‌కు సౌత్‌లో మంచి పేరుంది. ఆయన తాజా సినిమా ‘కాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. శింబుతో అతను ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ అయింది.



Click it and Unblock the Notifications











