కొమరం పులిలో మెరువనున్న ఆ స్టార్ హీరో...!!
పవన్ కళ్యాణ్ పులి చిత్రంలో తమిళ హీరో శింబు ఓ ఐటం సాంగ్ చేయనున్నాడని సమాచారం. తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. ఆయన తమిళ పాట ఉంటే ఓ స్పెషల్ లుక్ వస్తుందని దర్శకుడు సూచించారు. దానికి పవన్ అందులో తమిళ హీరోనే యాక్ట్ చేస్తేనే బావుంటుందని తేల్చారుట. ఆ మేరకు ఎస్.జె. సూర్యకి శింబుకీ ఉన్న అనుభంధం దృష్ట్యా ఒప్పించారు. గతంలో పవన్, సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఖుషీ చిత్రంలోనూ ఓ హిందీ పాట ఉండటం తెలిసిందే. అలాగే శింబు కూడా వల్లభ, మన్మధ ల ద్వారా ఇక్కడ పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాత శింబు హీరోగా వచ్చి డబ్బింగ్ అయినవి ఏవీ ఇక్కడ ఆడలేదు. దాంతో శింబుకు కూడా ఇక్కడ మార్కెట్ పై కన్ను ఉంది. దాంతో రెండూ కలిసి వస్తాయనే ఈ చిత్రంలో ఐటం సాంగ్ కి కమిట్ అయ్యారంటున్నారు. అయితే ఈ విషయం ఏమీ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉంది. పులి చిత్రం ద్వారా హీరోయిన్ గా నిఖిషా పటేల్ పరిచయం అవుతోంది.


Click it and Unblock the Notifications











