కుట్రలు పన్నినా నా ఫ్యాన్స్ చూసుకుంటారు
"ఒకరి ప్రతిభను అణచాలని భావిస్తే అదింకా మెరుగుపడుతుంది. ఇది నిజం. నా విషయంలో జరిగింది ఇదే. ఎవరు ఎలాంటి కుట్రలు పన్నినా అభిమానులు నన్ను గెలిపిస్తారు" అంటున్నారు తమిళ యంగ్ హీరో శింబు. ఆయన తాజా చిత్రం ఒస్తి (దబాంగ్ రీమేక్)విడుదల సమయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందులపై అతను స్పందించాడు. అలాగే... "ఎక్కడ నేను ఎదిగిపోతానోనని కొందరు సమస్యలు సృష్టిస్తున్నారు. నా ఉన్నతిని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ఒస్తి చిత్రం ప్రారంభ సమయంలో పోలీసు డ్రస్ ఇతనికేమి బాగుంటుందన్నారు. అలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఒస్తికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. హిట్టు, ప్లాప్ ఏ కొందరి చేతుల్లో ఉండవు. నాకు ఏది దక్కాలనుందో అది కచ్చితంగా దక్కుతుంది" అన్నారు.
ఇక తనను అణచాలని చూసేవాడు ఎవరైనా కావచ్చునని, వారికి తన ఫ్యాన్సే బుద్ది చెప్తారన్నాడు. ఇక తన తాజా చిత్రం వే ట్టైమన్నన్ గురించి చెపుతూ.. "నేనింతవరకు నటించిన చిత్రాలన్నింటికంటే అధిక బడ్జెట్ చిత్రమిది. దీని కథ చెన్నైలో ప్రారంభమై అమెరికా, ఐరోపాల వరకు సాగుతుంది. హన్సిక, దీక్షాసేత్, మరో హాలీవుడ్ నటి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిక్ ఆర్ట్స్ చక్రవర్తి ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు నెల్సన్. చిత్రం కొత్త స్టైల్‌లో ఉంటుంది. విన్నైతాండి వరువాయా తర్వాత వానం చిత్రం చేశాను. ఏ హీరో సాహసించని పాత్రను వానం చిత్రంలో నేను చేశాను. ఇందులో నా పాత్ర 45 శాతమే ఉంటుంది. ఈ చిత్రం తర్వాత మంచి మాస్ చిత్రం చేయాలని భావించా" అన్నారు.


Click it and Unblock the Notifications











