ఎవరు ఏమనుకున్నా శింబు, త్రిష ప్లాన్ ఇదే.. మ్యాటర్ అంత వరకు వచ్చిందన్నమాట!
కోలీవుడ్ లో అగ్ర నటులు ఎంత మంది ఉన్నా కూడా అక్కడ వార్తల్లో అందరిని డామినేట్ చేసే హీరో మాత్రం శింబు అనే చెప్పాలి. సక్సెస్ వచ్చినా రాకపోయినా కూడా ఈ కోలీవుడ్ మన్మథుడు మాత్రం తన రేంజ్ ని ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తుంటాడు. ప్రతి సినిమాలో వీలైనంత వరకు తన స్టైల్ మార్క్ ఉండేలా చూసుకుంటాడు. ఇక ఈ తమిళ స్టార్ మొత్తానికి పెళ్లికి సిద్ధమవుతున్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే.

అందుకే అనుమానాలు ఎక్కువవుతున్నాయి
గత కొన్ని వారాలుగా శింబు సీనియర్ హీరోయిన్ త్రిషను వివాహం చేసుకోబోతున్నట్లు టాక్ అయితే గట్టిగానే వస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా శింబు పెళ్లికి సంబంధించిన వార్తలు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. ఎక్కడ కూడా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు గాని... వైరల్ అవుతున్న కథనాలపై ఈ స్టార్స్ క్లారిటీ ఇవ్వకపోవడంతో అనుమానాలు ఎక్కువవుతున్నాయి.

ఆయన సైలెంట్ అవ్వడంతో..
ప్రతిసారి కొడుకు పెళ్లిపై ఎదో ఒక విధంగా స్పందించే శింబు తండ్రి టి.రాజేందర్ ఈ సారి మాత్రం ఒక ప్రెస్ మీటింగ్ లో ముక్క కూడా మాట్లాడలేదు. గతంలో తన నిర్ణయం ద్వారానే శింబు వివాహం జరుగుతుందని చెప్పిన ఆయన పిల్లను చూస్తున్నట్లు కూడా అన్నారు. పైగా రూమర్స్ ని నమ్మవద్దని శింబు పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులదే తుది నిర్ణయమని చెప్పిన రాజేందర్ సడన్ గా సైలెంట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మిడియాలో గుడ్ న్యూస్
ఇక తమిళ స్టార్ సింబు అక్టోబర్ 22 న సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నారు. చాలా కాలంగా అతను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
ఇక అతని సోషల్ మీడియా అరంగేట్రం గురించి వివరాలను అతని పిఆర్ బృందం ప్రకటించింది. ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే ఒక గుడ్ న్యూస్ చేబుతాడట.
Recommended Video

త్రిష, శింబు సీక్రెట్ ప్లాన్
వివాహ వివరాలను ప్రకటించడానికి అతను సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నాడని ఊహాగానాలు వస్తున్నాయి. త్రిషతో డేటింగ్ విషయాన్ని అలాగే, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇక త్రిష, శింబు ప్లాన్ వేసుకొని ఒకేసారి సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు కోలీవుడ్ మరొక రూమర్ కూడా వస్తోంది. లేదా ఇరు వర్గాల అభిమానులకు ఈ పుకార్ల స్పష్టత ఇచ్చేలా ట్వీట్ రావచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











