రాధిక కూతురు, ఆ హీరో పెళ్లికి ముందే శృంగారంలో..?
ఈ తరం యువత పెళ్లికి ముందే శృంగారంలో ఉండే మజాను రుచి చూడటం, డేటింగ్ లాంటి పాశ్చాత్య పోకడలతో పాటు డ్రగ్స్, తాగుడు లాంటి దురలవాట్లకు బానిసవుతున్న నేపథ్యంలో....వీటిని బేస్ చేసుకుని తమిళంలో ఓ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో తమిళ హీరో శింబు, రాధిక-శరత్ కుమార్ల కూతురు వరలక్ష్మి నటించనున్నట్లు తెలుస్తోంది. వీర్యదానం అంశాన్ని కూడా ఈచిత్రంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వైవిద్యమైన చిత్రాలను తెరకెక్కించడంలో ముందుండే తమిళ తంబీలు ఈచిత్రాన్ని బాలీవుడ్ స్టయిల్‌లో రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు.
'పోడ పోడి' పేరుతో రూపొందుతున్న ఈచిత్రంలో శింబు, వరలక్ష్మిలు ఫారిన్‌లో పెరిగి ఇండియాకు వచ్చిన యంగ్‌స్టర్స్‌గా కనిపించ బోతున్నారు. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
పెళ్లికి ముందే శృంగార అనుభవం కాన్సెప్టుతో వచ్చే సినిమాలను ఒకప్పుడు......ప్రత్యేక కేటగిరీలో చూసే వారు. కానీ రాను రాను ఇలాంటి విషయాలపై యువతలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ తరహా సినిమాలకు డిమాండ్ పెరిగింది. వీటిని సాధారణ సినిమాలుగానే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కూడా.
కాగా...వరలక్ష్మి త్వరలో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్కినేని యువ హీరో నాగ చైతన్య హోగా రూపొందబోయే చిత్రంలో వరలక్షిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఖరారు కాదు. ఇతర తెలుగు హీరోలు కూడా వర్మలక్ష్మిని తమ సినిమాలోకి తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.


Click it and Unblock the Notifications












