ఆ అమ్మాయే కావలంటున్నలిటిల్ స్టార్: శింబు
శింబు తన తాజా చిత్రం 'విన్నైత్తాండి వరువాయ" (తెలుగులో ఏ మాయ చేసావె) సూపర్ హిట్ అవ్వడంతో గాల్లో తేలుతున్నాడు. దాంతో ఇకమీదట తాను ఎక్కువగా ఇలాంటి రొమాంటిక్ సినిమాలే చేయాలని ఆనుకుంటున్నాడు. 'కోలీవుడ్" లో అందరూ లిటిల్ సూపర్‌స్టార్ అని పిలుచుకునే శింబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. 'విన్నైత్తాండి వరువాయ సినిమా విడుదలకు ముందు శింబు, తాను సంపాదించుకున్న స్టార్‌డం, పేరు ప్రఖ్యాతులన్నీ పోగొట్టుకుని పాతాలానికి చేరువలో ఉన్నాడు. కానీ చివరి నిమిషంలో గౌతమ్ మీనన్ సినిమాలో చేద్దామని తాను తీసుకున్న నిర్ణయమే ఈ రోజున మళ్ళీ శింబుని తీసుకెళ్ళి ఎక్కడో నిలబెట్టింది.
ఈ సినిమా విజయం తనకు మళ్ళీ కాస్త ఊపిరి పీల్చుకొంటున్న తరుణంలో, రెట్టించిన ఉత్సాహంతో శింబు ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ని నటింపచేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఒకప్పటి సూపర్ స్టార్ అనీల్ కపూర్ కుమార్తే సోనమ్ కపూర్ భాలీవుడ్ లో'సావర్య" చిత్రంతో పరిచయమై, ఢిల్లీ6 చిత్రంలో తన నటనతో ప్రేక్షకుల మన్ననలను పొందినది. దాని తర్వాత తమిళంలో అజ్మల్ సరసన 'కరుప్పమ్ పట్టి" చిత్రంలో నటించి తమిళ తంబిల అపార అభిమానాన్ని చూరగొన్నది. ప్రస్తుతం బాలీవుడ్ లో యమా బిజీగా ఉన్న సోనమ్ కపూర్ ని 'కోలివుడ్" గడప తొక్కించి శింబు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది కొద్ది రోజులు వేచి చూస్తే సరి.!


Click it and Unblock the Notifications











