»   » అనుష్కను పెళ్ళి చేసుకుంటానంటూ బార్ లో తెగ హంగామా..!

అనుష్కను పెళ్ళి చేసుకుంటానంటూ బార్ లో తెగ హంగామా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ నటుడు, నయనతార మాజీప్రియుడు శింబు ఇప్పుడు అనుష్క వెంట బడుతున్నాడని కోలీవుడ్ ఇండస్ట్రీ కోడై కూస్తోంది. శింబు మనసు తెలుసుకున్న అనుష్క కూడా అతడిని చూసి తనకే తెలిసిన ఓ మెత్తనైన మత్తు నవ్వి నవ్విందట. ఇక ఆ తర్వాత ఏమైందీ అని చూస్తే... ఇటీవలే శింబు ఖరీదైన ఓ డైమండ్ నెక్లెస్‌ను అనుష్కకు బహూకరించాడట. దానికి తోడు అనుష్క శింబు ఇంటికి కూడా వెళ్లిందట. అక్కడ శింబు తల్లి ఆమెను సాదరంగా ఆహ్వానించి మనస్పూర్తిగా ఆశీర్వదించినట్లు సమాచారం.

ఈ సంగతిని శింబు స్వయంగా ఓ బార్‌లో మందుకొడుతూ అనుష్కతో తనకు గల సాన్నిహిత్యాన్ని వివరించడమే కాక త్వరలో ఆమెను పెండ్లి చేసుకుంటానని తెగ హంగామా చేసినట్లు అతడి సన్నిహితులు చెపుతున్నారు. అయితే ఈ విషయమై అనుష్కను అడిగితే..ప్రేమా లేదూ...దోమా లేదూ. అసలు శింబు ఎవరూ...? అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తోందట. అదిసరే.. మరి గిప్ట్‌లు మాటో అంటే నోరు మెదపకుండా అక్కడ నుంచి లేచిళ్లి పోయిందట. అంటే అది నిజమనుకోవాలా...? అబద్ధమనుకోవాలా...? ఈ సంగతి మరోసారి అడుగుదాం.

ఈ రోజు విడుదలైన వేదం చిత్రంలో అనుష్క వేశ్య పాత్రలో నటించింది. అటువంటి పాత్ర ఎందుకు చేశావని అడిగితే...కొత్తదనం కోసం అని బదులిచ్చింది. మంచి సెలక్షనే కదా..!!

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu