ఆ హీరోని నమ్మకండి...అతనొట్టి మాయగాడు...!

By Sindhu

గతంలో నయనతారతో ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత ఆమె ప్రభుదేవాతో కమిట్ అవడంతో అప్సెట్ అయిన తమిళ కథానాయకుడు శింబు.. ఆ తర్వాత ఇక తాను పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానంటూ అప్పట్లో చెప్పాడు. అయితే, ఈ విషయంలో ఇప్పుడు మాట మారుస్తున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటానని చెబుతున్నాడు. ఇదేమిటి బాబూ... ఈ మార్పేమిటి? అనడిగితే, 'అదంతా సినిమా ప్రభావమే' అంటున్నాడు.

ఆమధ్య తాను చేసిన 'విన్నైతాండి వరువాయా' (తెలుగులో 'ఏ మాయ చేసావే') తనలో ఈ మార్పు తెచ్చిందనీ, ప్రేమలో వున్న తీయదనాన్ని తెలియజెప్పిందనీ అంటున్నాడు. అందుకని, తాను ప్రేమించే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెబుతున్నాడు. ఆ సినిమా అతనిపై అంతటి ప్రభావం చూపిందట. అయితే, 'శింబు మాటల్ని నమ్మకండి... అతనొట్టి మాయగాడు... 'అని కూడా కోలీవుడ్ లో కొంతమంది కామెంట్ చేస్తున్నారు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X