సిమ్రాన్ వయస్సు బాధ

ఆ మధ్య హాస్యనటుడు కృష్ణభగవాన్ సరసన "జాన్ అప్పారావు 40 ప్లస్" చిత్రంలో హీరోయిన్ పాత్ర పోషించి..తిరిగి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సిమ్రాన్..తాజాగా తమిళ పరిశ్రమలోనూ తన హవాను కొనసాగించటానికి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ఆమె తాజాగా పశుపతి హీరోగా చేస్తున్న (మోహన్ బాబు గేమ్ రీమేక్) సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేగాక మొన్నా మధ్య రిలీజైన తమిళ హీరో సూర్య సరసన"సూర్య సన్నాఫ్ కృష్ణన్"లో కూడా చేసింది. అయితే అన్ని నడి వయస్సు పాత్రలే వస్తున్నాయని భాధ పడుతోంది. మీ వయస్సుకి తగిన పాత్రలే వస్తున్నాయి కదా అంటే కోప్పడుతోంది. ఎల్లకాలం ఒకేలా ఉండాలంటే కష్టం కదా.


Click it and Unblock the Notifications











