twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిమ్రాన్ వయస్సు బాధ

    By Staff
    |

    Simran
    నిన్నటి అందాల తార సిమ్రాన్ అవకాశాలు లేక ఉనికి చాటుకోవటం కోసం విపరీతంగా ప్రయత్నిస్తోందన్న సంగతి తెలిసిందే. అందుకోసం ఆమె రకరకాల స్టేట్ మెంట్స్ ఇస్తోంది. హీరోలకు అల్లుళ్లు వచ్చినా నటించగాలేందీ...నేను నటిస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది. పెళ్ళయి బాబు పుట్టాక కూడా తనలో ఏ మాత్రం అందం తరగలేదని తనకూ ఓ ఛాన్స్ ఇవ్వాలని నిర్మాతలకు విన్నవించుకుంటోంది. అంతేగాక తాను అంతకుముందులాగే నటించగలనని,డాన్స్ చేయగలనని చెప్తోంది. ఇక వివాహం అయినంత మాత్రాన నాలో అందం ఎక్కడికీ పోలేదని వివరిస్తోంది.

    ఆ మధ్య హాస్యనటుడు కృష్ణభగవాన్ సరసన "జాన్ అప్పారావు 40 ప్లస్" చిత్రంలో హీరోయిన్ పాత్ర పోషించి..తిరిగి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సిమ్రాన్..తాజాగా తమిళ పరిశ్రమలోనూ తన హవాను కొనసాగించటానికి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ఆమె తాజాగా పశుపతి హీరోగా చేస్తున్న (మోహన్ బాబు గేమ్ రీమేక్) సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేగాక మొన్నా మధ్య రిలీజైన తమిళ హీరో సూర్య సరసన"సూర్య సన్నాఫ్ కృష్ణన్"లో కూడా చేసింది. అయితే అన్ని నడి వయస్సు పాత్రలే వస్తున్నాయని భాధ పడుతోంది. మీ వయస్సుకి తగిన పాత్రలే వస్తున్నాయి కదా అంటే కోప్పడుతోంది. ఎల్లకాలం ఒకేలా ఉండాలంటే కష్టం కదా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X