వార్తలు రాసే ముందు తెలుసుకొని రాయండి.. సిమ్రాన్ ఝలక్
సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు నటించిన చంద్రముఖి చిత్రం దక్షిణాదిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. పీ వాసు దర్శకత్వంలో నటించిన చిత్రం హిందీలో రీమేక్ అయి అక్కడ కూడా బ్రహ్మండమైన విజయాన్ని అందుకొన్నది. ఇప్పుడు మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్‌గా చంద్రముఖి 2 వస్తుందనే వార్తలు రజనీ అభిమానులను ఆనందంలో ముంచెత్తాయి.
రాఘవ లారెన్స్ చెప్పినట్టు తమిళ మీడియా కథనాల ప్రకారం.. పీ వాస్తు దర్శకత్వంలోనే సన్ పిక్చర్స్ రూపొందించే చంద్రముఖి 2 చిత్రంలో తాను నటిస్తున్నట్టు తెలిపారు. అయితే జ్యోతిక స్థానంలో సిమ్రాన్ నటిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఈ వార్తపై సిమ్రాన్ స్పందిస్తూ.... చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తున్నట్టు వచ్చిన వార్తలన్నీ ఫేక్. ఈ వార్త నా అభిమానునులను నిరాశకు గురిచేస్తాయని తెలుసు. ఆ సినిమాలో నన్ను నటించమని ఎవరూ అడుగలేదు. ఈ వార్తనైనా ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకొని ప్రసారం చేయాలి. నేను చంద్రముఖి 2 లో నటించడం లేదు అని సిమ్రాన్ తెలిపారు.
పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని సిమ్రాన్ మళ్లీ వెండితెర మీద ప్రత్యక్షం అవుతున్నారు. పలు సినిమాల ఆఫర్లతో ఆమె బిజీగా మారనున్నారు. ఈ క్రమంలోనే సిమ్రాన్ చంద్రముఖి 2లో నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. దానిపై చెలరేగిన గందరగోళంపై క్లారిటీ ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











