నన్ను కెలకద్దంటూ సిమ్రాన్ వార్నింగ్
సిమ్రాన్ వివాహం చేసుకుని సెటిలయ్యాక ఆమెను ఇప్పుడు తల్లి పాత్రలు చేయమంటూ నిర్మాతలు,దర్శకులు వస్తున్నారు. వాటిని సిమ్రాన్ చాలా కోపంగా తిప్పికొడుతోంది. నిన్న మొన్నేగా నేను నిజ జీవితంలో తల్లి అయ్యింది.. అప్పుడే స్క్రిన్ పై పెద్ద హీరోలకు తల్లిగా చేయమంటారా అని అంత ఎత్తున కోపంతో ఎగిరిపడుతోంది. తను ఇప్పుడు నదియా, కుష్భుల దారిలో స్మాల్ స్క్రీన్ కి వచ్చి గేమ్ షో చేసుకుంటున్నానని, హ్యాపీగా ఉన్నానని అంది. ముఖ్యంగా తనతో చేసిన హీరోలకే తల్లిగా అడుగుతున్నారని, అది తనకు చాలా అవమానంగా ఉందని భాధపడింది. ఇక ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో నెంబర్ వన్ స్ధాయికి వెళ్ళిన సిమ్రాన్ పెళ్ళయ్యాక వేషాలు కరువయ్యాయి.
పెళ్లి అనంతరం తమిళంలో ఓ చిత్రం, తెలుగులో 'జాన్ అప్పారావు-40 ప్లస్' అనే సినిమా చేసింది. తమిళంలో చేసిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ మంచి ఫలితాన్నే ఇచ్చినా ఆఫర్స్ తెచ్చి పెట్టలేకపోయింది. దాంతో ఆమె ఖాళీగా ఉండటమెందుకుని సైడ్ బిజెనెస్ గా హోటల్ వ్యాపారం ప్రారంభించి క్లిక్ అయ్యింది. చెన్నైలో ఆమె నడుపుతున్న హోటల్స్ మంచి లాభాలతో నడుస్తున్నాయి. త్వరలో మూడో హోటల్ ప్రారంబించాలనే యోచనలో ఉంది. అయితే సినిమా దురద తీరని సిమ్రాన్ ఆ డబ్బుని సినిమా నిర్మాణంలో పెట్టాలని నిర్ణయించుకుంది. త్వరలోనే సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. ఆమె సన్నిహితులు చాలామంది నిర్మాణ రంగంలోకి అనుభవం లేకుండా వెళ్ళద్దన్నా ఆమె వినకుండా దిగుతోంది. పోనీ వేషాలిస్తాం అంటే ఇలా వార్నింగ్ లు ఇస్తోంది.


Click it and Unblock the Notifications











