సిమ్రాకైనా తప్పదు

డబ్బులిచ్చి తన సినిమాలు థియెటర్లులో చూడకపోయినా టి.వి.లో వచ్చినప్పుడల్లా మంచి టి.ఆర్.పి.రేటింగ్ సంపాదించుకుంటున్నాయని తెలుసుకుంది. దాంతో ఆ రూటు లోనే వెళ్ళి జనానికి దగ్గరవ్వాలని డిసైడయ్యింది. తాజాగా టి.వి.రంగాన్నిఏలుతున్న ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఆమెతో ఎగ్రిమెంటు కుదుర్చుకుంది. అంటే ఆమె త్వరలో నేరుగా మనని పలకరించబోతోందన్నమాట. ఇది తెలిసిన సీనియర్లు తాము ఊహించిందే అన్నట్లుగా ఫేస్ పెట్టి "ఒకసారి ముఖంపై మేకప్ పడ్డాక మహామహులే ఈ గ్లామర్ వలయం నుంచి తప్పించుకోలేకపోయారని..చివర క్షణం దాకా తెరపై యేదో మూలైనా కనపడటానికి ప్రయత్నం చేస్తారని....ఎంతటి వాళ్ళకైనా సినీ కెరీర్ లో చివరి ప్రస్థానం టి.వి.నే.తప్పదు!"అంటూ కామెంట్లు చేస్తున్నారు


Click it and Unblock the Notifications











