సినీ కష్టాల్లో ...సిమ్రాన్

By Staff

Simran
సెకండ్ ఇన్నింగ్స్ సిమ్రాన్ కి కలిసి రావటం లేదు. ఎలాంటి పాత్రయినా ఫరవాలేదంటూ కృష్ణభగవాన్ హీరోగా వచ్చిన జాన్ అప్పారావులో సిమ్రాన్ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే కృష్ణభగవాన్ కామెడీ కానీ, సిమ్రాన్ ముదర అందాలు కానీ ఈ చిత్రాన్ని ఏమాత్రం కాపాడలేకపోయాయి. ఇక ఒక్క మగాడైతే ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన పని లేకుండా పలాయినం చిత్తగించింది. దీంతో ఇక తెలుగులో తనకు వర్కవుట్ అవదనుకున్న సిమ్రాన్ తట్టా బుట్టా సర్దుకుని తమిళంలోకి తరలిపోయింది. అయితే అక్కడ కూడా అవకాశాలు కనపడకపోవటంతో ఓ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా అవతారమెత్తింది. ఇంతలో ఆమెకు ఓ పేరున్న బ్యానర్ నుండి ఆఫర్ వచ్చింది. ఆశ్చర్యపోయి వాళ్ళని కలిసిన ఆమె వారి ఆఫర్ కి షాకయ్యింది.

ఆ ఆఫర్ 'ప్రేమిస్తే' భరత్ హీరోగా చేస్తున్న సినిమాలోట. హీరోగా తమిళంలో మంచి పేరున్న భరత్ చిత్రంలో అవకాశమంటే సంతోషపడాల్సిన విషయమే కదా అనుకుంటే అసలు విషయం తర్వాత తెలిసింది. ఈ చిత్రంలో సిమ్రాన్ కనిపించబోయేది హీరోయిన్‌గా కాదట. అక్కలాంటి పాత్రలోనట. దాంతో ఆమె డైలమాలో పడ్డా ఓ రెండు రోజులు తర్వాత పచ్చ జెండా ఊపింది. అంటే తనకిక హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదని ఆమెకి అర్ధమైందన్నమాట. ఈ విషయం తెల్సుకున్న తెలుగు దర్శకులు కొందరు ఆమెని కుర్ర హీరోలకు అక్కగా ఉండే కథలు అల్లే పనిలో పడ్డారట. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూనమ్ భజ్వా నటిస్తోందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X