నిర్మాతగా మారిన సిమ్రాన్, హీరో ఎవరంటే...
తెలుగు, తమిళ చిత్రాలో వరసగా పెద్ద హీరోలందరి ప్రక్కనా చేసి పెళ్ళి చేసుకుని సెటిలయిన అందం సిమ్రాన్. ఇప్పుడామె తన భర్త దీపక్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రం నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె మీడియాకు తెలియచేస్తూ..అరిజెమ్ ప్రైవేట్ మూవీస్ లిమిలెడ్ అనే సంస్థను స్థాపించి చిత్ర నిర్మాణంతో పాటు టెలిఫిలింస్ నిర్మించాలనుకుంటున్నాను. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. నా భర్త దీపిక్ ని ఈ చిత్రంతో పరిచయం చేస్తాను అన్నారు. అలాగే తమిళ అభిమానులుకు తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. వారు తనకు ఉన్నత స్థానాన్ని కల్పించారని ఆమె చెప్పుకొచ్చింది. తాను చెన్నైలో సెటిల్ కావడానికి అభిమానుల ఆదరణ కూడా ఒక కారణం అన్నారు. చెన్నైలో ఇల్లు కట్టుకొని దీపావళి రోజున గృహ ప్రవేశం చేశామని తెలిపారు. అలాగే తాను మళ్లీ నటించాలని నిర్ణయించుకున్నానని, మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. దర్శకుడు రాజేశ్వర్ రూపొందించే చిత్రంలో నటించడానికి అంగీకరించానని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











