క్రేజీగా సిమ్రాన్ రీఎంట్రీ.. రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా!
దక్షిణాది సినీరంగంలో సినీ తార సిమ్రాన్ పరిచయం అక్కర్లేదు. పెళ్లికి ముందు సౌత్ సూపర్‌స్టార్లందరితోనూ, అలాగే అగ్రహీరోలందరితోనూ ఆమె జతకట్టారు. పెళ్లి తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. తెలుగులో ఓ చిత్రంలో నటిస్తున్నట్టు రూమర్లు వినిపించినా ఆ వార్తలో వాస్తవం లేదని తెలిసింది. కానీ ప్రస్తుతం క్రేజీగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాతో మళ్లీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

రజనీకాంత్, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో
కాలా తర్వాత దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో రజనీకాంత్ ఓ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. చాలా రోజుల క్రితమే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. రజనీ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో ఈ చిత్రం మరింత ప్రాధాన్యతను సంతరించుకొన్నది.
Recommended Video


రజనీకాంత్‌తో సిమ్రాన్ ఓకే
రజనీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో వచ్చే ఈ సంచలన చిత్రం కోసం సిమ్రాన్‌ను యూనిట్ సంప్రదింపులు జరిపారు. దాంతో ఈ సినిమాలో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా సిమ్రాన్ నటిస్తున్నదన్నది తాజా సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నది.

విలన్‌గా విజయ్ సేతుపతి
సన్ పిక్చర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలకపాత్రను పోషిస్తున్నారు. అయితే విజయ్ సేతుపతి పోషించే పాత్ర విలన్ రోల్ అని తమిళ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతున్నది. అయితే ఇటీవల కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ.. విజయ్ సేతుపతిది ఈ చిత్రంలో కీలకపాత్ర అని చెప్పారు.

ఐపీఎల్ ఫైనల్లో రోబో2 ట్రైలర్
రజనీకాంత్ నటించిన రెండు చిత్రాలు కాలా, రోబో2 విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కాలా జూన్7వ తేదిన రిలీజ్ అవుతన్నది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన రోబో2.0 చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఐపీఎల్ 2018 ఫైనల్‌లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











