రజనీకాంత్‌కు హీరోయిన్‌గా కలల రాణి..!
Recommended Video

సూపర్ స్టార్ రజనీకాంత్ పాలిటిక్స్ తో బిజీ అయ్యేముందు వీలైనన్ని ఎక్కువ చిత్రాల్లో నటించాలని భావిస్తున్నారు. కాలా చిత్రం విడుదలైన వెంటనే రజని కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజని ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ డార్జిలింగ్ లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి హీరోయిన్ గా సీనియర్ నటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సిమ్రాన్ ని ఈ చిత్రానికి హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మిలీనియం ఆరంభంలో
ఈ మిలీనియం ఆరంభంలో నటి సిమ్రాన్ యువతని ఒక ఊపు ఊపింది. తెలుగు తమిళ భాషల్లో పలువురు స్టార్ హీరోల సరసన సిమ్రాన్ నటించింది. చిరంజీవి, నాగార్జున, అజిత్, బాలయ్య ఇలా అందరి హీరోల సరసన సిమ్రాన్ ఆడిపాడింది.

రజనితో
కుర్రాళ్ళ కలల రాణిగా వెలుగు వెలిగిన సిమ్రాన్ సూపర్ స్టార్ రజని సరసన మాత్రం ఇంత వరకు నటించలేదు. కార్తీక్ సుబ్బరాజ్, రజని చిత్రంలో నటింపజేసేందుకు నిర్మాతలు ఇటీవల సిమ్రాన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.

40 రోజులు అక్కడే
కాలా చిత్రం నిరాశ పరచడంతో రజని ఫాన్స్ కార్తీక్ సుబ్బరాజ్ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. మెర్కురీ, పిజ్జా లాంటి విభిన్న చిత్రాలతో కార్తీక్ సుబ్బరాజ్ ప్రతిభగల దర్శకుడిగా నిరూపించుకున్నారు. 40 రోజుల పాటు ఈ చిత్ర షూటింగ్ డార్జిలింగ్ లో జరగనున్నట్లు తెలుస్తోంది.

ప్రధాన నటులతో
సిమ్రాన్ హీరోయిన్ గా నటించే విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విజయ్ సేతుపతి, బాబీ సింహ, సంపత్ రాజ్ లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











