కమల్ హాసన్ సరసన సిమ్రాన్ ఖరారు

By Srikanya

చెన్నై : మాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన 'దృశ్యం' అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. మోహన్‌లాల్‌ - మీనా జంటగా నటించారు. పలు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు గట్టి పోటీ నెలకొనగా.. తమిళంలో నటించేందుకు కమల్‌హాసన్‌ను ఎంపిక చేశారు. మీనానే తమిళంలోనూ నటింపజేయనున్నట్లు.. ఆమె కూడా అంగీకరించినట్లు కొన్నిరోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే ఆ పాత్రకు గానూ సిమ్రాన్ నే ఫైనల్ చేసారని సమాచారం. సిమ్రాన్‌ గతంలో కమల్‌హాసన్‌తో 'పమ్మల్‌కే సంబంధం', 'పంచతంత్రం' చిత్రాల్లో నటించింది.

అలాగే ఓ మంచి పాత్ర ఉందంటే నటులు దాన్ని చేసి మెప్పించాలని తాపత్రయపడుతూంటారు. తాజాగా విక్రమ్,కమల్ హాసన్ విక్రమ్ ఓ పాత్ర కోసం పోటీ పడ్డారు. అయితే అది కమల్ నే వరించిందని కోలీవుడ్ సమాచారం. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, సీనియర నటి మీనా ప్రధాన పాత్రధారులుగా ఇటీవల విడుదలైన 'ద్రిష్యుం' అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. అందులో మోహన్ లాల్ పాత్ర కోసం ఈ నటులిద్దరూ పోటీ పడ్డారు.

ప్రేమ, యాక్షన్‌ సన్నివేశాలకు తావులేని ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ ఇద్దరు పిల్లలకు అమాయక తండ్రిగా కనిపించి మెప్పించారు. ఈ పాత్రలో నటించేందుకు తమిళం నుంచి కమల్‌హాసన్‌, చియాన్‌ విక్రమ్‌ ఆసక్తి కనబర్చారని తెలిసింది. దర్శకుడు జీతుజోసఫ్‌ మాత్రం కమల్‌నే ఎంపిక చేసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. తమిళంలోనూ ఆయనే తెరకెక్కించనున్నారని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు సమాచారం.

Simran To Pair Up With Kamal Hassan In Drishyam Remake?

ఇక రీమేక్ సినిమాలను ఎన్నింటినో చేసి రీమేక్ ల ద్వారా హిట్ లు సాధించిన మన తెలుగు హీరో వెంకటేష్ మరో సారి ఈ రీమేక్ సినిమా ని ఎంచుకున్నారు. "దృశ్యం'' సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా పునర్ నిర్మించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైడ్ యాంగిల్ ఈ మూడు సంస్థలు సినిమాను తెలుగులో సంయుక్తంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు అతి త్వరలో వెల్లడించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X