twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భువనేశ్వరి ఎఫెక్ట్..ఎడిటర్ అరెస్ట్

    By Srikanya
    |

    బుల్లి తెర నటి భువనేస్వరి బ్రోతల్ కేసు వివరాలు ప్రచురించినందుకు తమిళ దినపత్రిక దినమలర్ ఎడిటపర్ లెనిన్ ని అరెస్టు చేసారు.కొందరు సినీ నటీమణుల మనోభావాలను కించపరిచేలా వార్తాపత్రికలో కథనాన్ని ప్రచురించారని సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను బుధవారం ఆయన కార్యాలయంలో ఖైదు చేశారు. ఆయన మీద మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టారు.

    లెనిన్‌ను మేజిస్ట్రేట్‌ సమక్షంలో హాజరు పరచి, అక్టోబర్‌ 21వ తేదీ వరకూ రిమాండ్‌ విధించిన తర్వాత ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిన పోలీసులు, న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతే సదరు విలేఖరిపై చర్య తీసుకున్నట్లు తెలిపారు. కోలీవుడ్‌ కు చెందిన చాలామంది నటీమణులు వ్యభిచార వృత్తిని కొనసాగిస్తున్నారని పేర్కొంటూ పలువురి పేర్లను ఈ వార్తాపత్రిక అక్టోబర్‌ 4వ తేదీ నాటి వార్తా కథనంలో ఉటంకించింది. మానవుల అక్రమ రవాణా చట్టం కింద కొన్ని రోజుల క్రితం ఖైదు అయిన బుల్లి తెర నటి భువనేశ్వరి వెల్లడించిన విషయాలను ఈ వార్తాకథనం ప్రస్తావించింది. ఈ కథనంపై విచారం వ్యక్తం చేస్తూ అక్టోబర్‌ 5వ తేదీన ఈ వార్తాపత్రిక ఒక ప్రకటన చేసినప్పటికీ, సినిమా నటీనటుల సంఘం ప్రతినిధుల బృందం పోలీస్‌ కమిషనర్‌ను కలుసుకుని ఫిర్యాదు ఇచ్చారు.

    కాగా, లెనిన్‌ను ఖైదు చెయ్యడాన్ని మద్రాస్‌ జర్నలిస్ట్‌ల సంఘం (ఎంయుజె) ఖండించింది. ఈ వార్తా కథనానికి లెనిన్‌ బాధ్యుడన్న నిర్ణయానికి పోలీసులు ఎలా వచ్చారని ఈ సంఘం ప్రధాన కార్యదర్శి డి సురేష్‌ కుమార్‌ విస్మయం వ్యక్తం చేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X