సూర్య 'సింగం-2' ఆడియో ఎప్పుడంటే..
చెన్నై : సూర్య కొత్త చిత్రం 'సింగం-2' శరవేగంగా ముస్తాబవుతోంది. జూన్ ఒకటిన ఆడియో ఆవిష్కరించనున్నారు. 'వేల్', 'ఆరు' చిత్రాలతో దర్శకుడు హరి, సూర్యలు హిట్ కలయికగా ముద్ర వేసుకున్నారు. ఈ కాంబినేషన్‌కు మరింతబలం చేకూర్చుతూ వచ్చిన 'సింగం' ఘన విజయాన్ని నమోదు చేసింది.
సూర్య పోలీసు అధికారిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 'సింగం'కు కొనసాగింపుగా రెండోభాగం తెరకెక్కిస్తున్నాడు హరి. ఇందులో సూర్య అంతర్జాతీయ పోలీసు అధికారిగా కనిపించనున్నాడు.తొలి భాగంలో నటించిన అనుష్కతో పాటు పాలబుగ్గల చిన్నది హన్సిక కూడా సూర్య సరసన ఆడిపాడుతున్నారు.
భారీ వ్యయంతో తెరకెక్కుతోన్న 'సింగం-2' చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఆడియోను జూన్ ఒకటిన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు. అంజలి సూర్యతో కలిసి ప్రత్యేకగీతంలో చిందులేయటం విశేషం.


Click it and Unblock the Notifications











