కేక పెట్టిస్తున్న సింగం-2 ఫస్ట్ లుక్
చెన్నై: సూర్య-అనుష్క జంటగా నటించిన 'సింగం' (తెలుగులో యముడు) ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడుదల చేసారు. అవి సూర్య అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సోషల్ నెట్ వర్కింగ్ లలో ఇవే పోస్టర్స్ ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్క, హన్సిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అంజలి ఓ ఐటమ్‌గీతంలో నర్తించనుంది. వివేక్, సంతానం ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సింగం చిత్రంలో తన రౌద్రపూరిత నటనతో అలరించిన సూర్య తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న సింగం-2 చిత్రం తో సారి తన ఆవేశపూరిత నటన ప్రదర్శించనున్నారు.
ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న సింగం-2 చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్ పతాకంపై ఎస్.లక్ష్మణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. సింగంలో అదరకొట్టిన అనుష్క సింగం-2లోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరింత గ్లామర్‌ను అందించడానికి మరో హీరోయిన్‌గా హన్సిక నటిస్తున్నారు. సింగం చిత్రానికి సంగీతాన్ని అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ సీక్వెల్‌కు పని చేస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా మార్చిలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ మసాలా చిత్రం కోసం తొలిసారిగా విడుదల చేసిన పోస్టర్లు సూర్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో హన్సిక స్కూల్ విద్యార్థినిగా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. ఇటీవలే వాటిని చిత్రించారు. ఈ ముద్దుగుమ్మ సూర్యతో కలిసి నటించటం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే చిత్రం మెగా హిట్ అవుతోందని ఆమె చెప్తోంది. అయితే చిత్రంలో ఆమె పాత్ర కేవలం పదిహేను నిముషాలు మాత్రమే ఉంటోందని తెలుస్తోంది. అనుష్క మెయిన్ హీరోయిన్.
హన్సిక మాట్లాడుతూ ''చిన్నప్పుడు తరగతి గదిలో గడిపిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి. మళ్లీ యూనిఫామ్ వేసుకొని స్కూల్‌కెళ్లి చదువుకొంటే ఎంత బాగుంటుందో కదూ. స్కూల్ పిల్లలతో కలిసి తరగతిలో కూర్చొంటే భలే తమాషాగా అనిపించింది. పాఠశాల రోజులు గుర్తుకొస్తున్నాయ''ని చెప్పింది. ఇంకో విషయమేమిటంటే... హన్సిక నిర్మాతగా మారబోతోందట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు తీయడం నా లక్ష్యం అంటోంది. ''ఎప్పట్నుంచో కంటున్న కల ఇది. తొందరలో సాకారమవుతుంద''ని చెప్పింది.


Click it and Unblock the Notifications











